Thursday, May 8, 2014

అమూల్య రాగబంధం



నా అనుకున్న అన్నీ 
నన్నుతో సహా 
ఇచ్చేసాను నీకు 
ఇంకా ఇచ్చేందుకు ఏమీ మిగలనంతగా 
అయినా 
నీ కళ్ళలో బాధే ప్రకాశిస్తుందెందుకో 
  
ఎవరికైనా ఇచ్చేసావేమో 
దొంగిలించారేమో ఎవరైనా .... హృదయాన్ని 
నా ఎద, మది మాత్రం 
నీ వద్దే 
పంచుకునేందుకు దాచుకునేందుకు నావద్దంటూ 
ఏమీ దాచుకో లేదు .... నా కోసం

నిన్ను గుండెలను 
గాఢంగా హత్తుకుని ముద్దాడాలనుంటుంది
కానీ ఏ ప్రతిస్పందననూ పొందలేక
వొదిలెయ్యాల్సొస్తుంది 
మరింత గాఢంగా దగ్గరకు లాక్కోవాలనే 
ఉద్వేగాన్ని దూరంగా నెట్టేసి .... మరీ
  
నీ గొంతు ద్వని లో 
బాధే వినిపిస్తూ ఉంది.
కేవలం నిశ్శబ్దమే ప్రతిద్వనిస్తూ ఉంది. 
వెన్నంటి వున్నట్లు .... నీడలా 
చీకటిలో నిలబడి 
ఎదురుచూస్తున్న రాగబంధం లా .... చెలీ

నీవు రాక .... ఉమ్మదము




నీవు వస్తావనే ఎదురుచూపులలో
తెలియని భారం
నొప్పి
విసుగు
ఆతురత .... ఆరంభంలో
నీవు రాని ఒంటరితనం లో మాత్రం
ద్వేషం
కోపం గా
ప్రబలమై
సహనం పరిక్షతో  
ఎంత వ్యర్ధమో కదా సమయం

Wednesday, May 7, 2014

అందమైన జీవితం




 
















నన్ను లోకి, ఆత్మ లోతుల్లోకి దూరి
ప్రేమించగలిగితే
అస్తిత్వం, జీవన వైశిష్ట్యాన్ని

అన్నీ ఒడుదుడుకులు,
అడ్డంకులు,
బాధలే ఎదురైనా మారి,

ఏ గాలి
తుఫానులకు తలవొంచని
వృక్షం లా

బలం సమకూర్చుకుని,
దృడంగా,
ధైర్యంగా పోరాడాలని  




నేను, ఒక అందం ఆనుభూతిని

పూలవనం జీవనం




ఎంత అందం సుకుమారంగా ఉన్నావో ....
నా కళ్ళకు
నీవు,
ఆ దివి నుండి దిగివచ్చిన దేవతవు లా

ఎలా తెలుసుకున్నానో .... ఈ నిజాన్ని
ఈ ప్రేమను, నా ఎద భావనలను
ఈ పరిమళం, ఈ పరవశం మదిలో
ఒక స్నేహం గా మొదలై .... నేడు

తెలుసుకున్నాను.
నా ప్రేమవు నీవనే పవిత్ర, పరిపూర్ణభావన
నీ అన్నీ నాకే చెందాలి అనే మనోబిలాష
ఆశ, తపన ను

సాయం సమయాల్లో అనిపిస్తుంటుంది.
అనుకుంటుంటాను
మనం కలవాలి ....
కలిసి అలాగే ఉండిపోవాలి అని

నీ పేరును ఒక పువ్వును లా త్రుంచి పలుకుతున్నప్పుడు
ఏదో ప్రత్యేకత .... నా అనే అధికారం
నాతో కలిసి నీవు సరదాగా
నలుగురూ ఈర్ష్యపడేలా నడవాలి అని,

ఎప్పుడూ
కష్టమే అనిపించినా
నిజాయితీగా ఉండాలని
నీ పట్ల .... ఈ జీవితం కడవరకూ అని

ఈ నిజాన్ని, నన్నూ విడమర్చి ....
కాలమైనా, పంచభూతాలైనా
నీకు నివేదించాలని
నా మనోభావనలను .....

కేవలం ప్రేమభావనలే .... నా ఊహల్లో నీవుంటే
హృదయ రాగ సరాగాలే అన్నీ
నీ చిరునవ్వు పూపరిమళాల కోసం
నిన్ను చేరువ కావడం కోసమే అన్నట్లు

ఈ మనసెప్పుడూ
నీ ఆలోచనలతో, నీ గురించే
ఆ ప్రత్యేకత ను విడమర్చలేను
నా ప్రేమ, అపరిమితం నీ పట్ల అనగలగడం మినహా




నా తపస్సు
ఈ ప్రేమయజ్ఞం ఫలించాలని
నీ ఎదలో ఒద్దికగా మౌనంగా ఉండాలని
నా మది ఎదల సంతులనం చేసుకుంటున్నాను.

ఏ స్వప్నలోకాలనుంచో
దిగివచ్చిన చెలీ
కేవలం నా పక్కన నీవుంటే చాలు ....
ఎంత అందమో, ఎంత మనోహరమో .... ఈ జీవితం

Tuesday, May 6, 2014

ప్రేమ భావనలు విరిసి .... నాలో



 
ఆమె కళ్ళలో
నిర్మలత, అమాయకత్వం
మంటలు వ్యాపించి
నా ఆత్మ ....
ఊపిరి పీల్చిన ప్రతిసారీ
ఆమె గుండె
కొట్టుకుంటున్న అలజడి
నా గుండె లో

నీ గుడిలో .... దేవతను కావాలని





నీవు కళ్ళు మూసుకుంటే
ఆ కలలో కనిపించే ముఖాన్ని కావాలని
ఏ రాత్తిరైనా నీవు సేద దీరే
కోరుకునే వెచ్చదనం స్పర్శను కావాలని
నీ ఊహల్లో పరవశాన్ని జగదేకసుందరిని
ఒక అద్భుత సౌందర్యాన్ని కావాలని
కలకు వాస్తవం కు మధ్య
అన్నీ నేనే అయ్యుండాలని .... నీ జీవితం లో

నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని
నన్నే నీవు శ్వాసిస్తుండాలని 
నా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి
అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ
నీ ప్రతి కలలోనూ నేనే అయి
నేను నిన్ను చూస్తు పరామర్శిస్తున్నట్లు
నా సాన్నిహిత్యమే నీ పారవశ్యం అవుతూ
ఇక్కడ, నా మనసంతా నీవై నీండిపోయిన విధంగా

నీ కనుచూపును కావాలని .... కోరుకుంటున్నాను
లోతుగా నీవు నీ ఆత్మలోకి చూసుకునే చూపును కావాలని
నీ ప్రపంచమంతా నేనే అయినట్లు
పరిపూర్ణతను నీవు నా కలయిక ద్వారా ....
నీవు ఎంతగానో కోరుకునే పరవశం
ఒక ఘాడమైన ముద్దును నేను కావాలని
నీ ప్రతి కోరిక పరిణామం సమాధానం
నీవు కోరుకునే అమరత్వం నేను కావాలని 




ఎవరూ ఎన్నడూ చూడని ఊహకందని
అద్భుతం, ఆసక్తిని నేను అని .... నీకు అనిపించాలని
నేను నిన్ను కోరుకుంటున్నంత ఘాడం గా
నన్ను దూరంగా వెళ్ళనీయని భావన నీలో ప్రబలి
నీ గుండె లోతుల్లో
నీవు ప్రతిష్టించుకునుండాల్సిన నీ దేవతనై ఉండాలని 
నీ పరిసరాలు .... వీచే గాలీ, పారే నీరూ, రగిలే అగ్ని,
ఆ ఆకాశం, ఈ భూమి అన్నీ నేనై నిండిపోవాలని .... నీ జీవితం లో

Sunday, May 4, 2014

ఏదో అవుతుందని తెలుసు .... కానీ
















వ్యక్తిత్వం అస్తిత్వం చేజారి పోతూ  
నాలో 
నిరంతరం ఒత్తిడి 
పేగు గోడల్లో రసాయనాలు స్రవిస్తూ .... ఆకలి

చుట్టుకుని పడుకునుండాల్సిన పాము 
తోకమీద నిలబడ్డట్లు 
ఆకలి పేగులు 
ఆవేశం విషం తో కాటేస్తానికి సిద్దంగా

గుండె ఆరాటం 
కనురెప్పలక్రింద సర్ధుకుని, నీరై ప్రవహించని 
బాధ లో తియ్యదనం 
కన్నీటి లో వెచ్చదనం కసిగా మారి ఆవిరై పోతూ

Saturday, May 3, 2014

కాలాన్ని స్తంభించనిద్దాం .... !




నేను, ఒక పోస్ట్ చెయ్యని ప్రేమ లేఖను
రాసుకున్నాను .... నిన్ననే
నాకు నేను విడమర్చుకునేందుకు
పదాలు దొరకలేదు
బహుశ,
నీవు దూరంగా ఎక్కడో ఉండటం వల్లో
నా సరసన లేకపోవడం వల్లో

నిన్న నేను నాకో విజ్ఞాపన పత్రం
రాసుకున్నాను.
చాలా కష్టం అనిపించింది.
అలా జరగకుండా
ఉండి ఉండాలనిపించింది.
కానీ,
పెంచుకున్న ప్రేమ మాత్రం
అది సహజమే ..... బాధతో తగ్గదు అంటుంది

ఆత్మ శోధన చేసుకున్నాను
పూర్వాపరాల్ని. నిజాన్ని
నేను నిన్నూ సంఘటనల్ని
సరిగ్గా అర్ధం చేసుకున్నానా అని,
నీ, నా సాంగత్యానుబంధం
పరస్పర అనురాగాన్ని చూసి
ఆశ్చర్యం వేస్తుంది. మనం కలిసుండకపోవడం

అనుకున్నదేమీ లేదు కానీ దూరమయ్యాము.
నేను ఈ స్థితిని భరించలేకపోతున్నాను
నా గుండె, నీ కోసమే కొట్టుకుంటుంది.
నీ కోసమే శ్వాసిస్తుంది.
నీకోసమే పాడుతుంది.
నీ భావనలే ఎప్పుడూ
నొప్పిని దాయగలుగుతున్నాను.
ఎద భావనల్నే దాయలేకపోతున్నాను.

నిద్రలో మాట్లాడుతున్నానని తెలిసింది.
నాలో నేను
ఓ పిల్లా!
నిన్నే ప్రార్ధిస్తున్నాను
నా మాటలన్నీ నీవు వినాలనే
ఆ పిదప
కలలో .... నువ్వెదురుపడితే
నిన్ను చూడాలని .... పిల్లా! కలలోనైనా

నిజం పిల్లా!
నేను ఎప్పటికీ మరువలేకపోతున్నాను
నాడు ఉద్యానవనంలో
మనం అతుక్కుపోయి కూర్చునున్నప్పుడు
నీవు అన్న మాటలు
నాతో కలిసి
ఏడడుగులు నడవాలనుందని
అందుకే
నాలో నిన్ను మోస్తూనే ఉన్నాను

ఇప్పుడు కాని ఎప్పుడైనా కానీ
నీకూ అవగతం కావాలని, అవుతుందని
ఆశపడుతున్నాను.
ఈ ప్రేమ భావనలే నీలోనూ
తప్పని స్థితి రావాలని
ఓ పిల్లా!
అప్పుడు మన సాహచర్యం పొదరింటి లోకి .... చూస్తావని
కాలం స్తంభించే క్షణాల .... జీవ సాఫల్యతను గుర్తిస్తావని

Thursday, May 1, 2014

నెమ్మదిగా చూస్తే




అకారణమేమో అనిపిస్తుంటుంది .... బాధ,
రోదించడం
ఏదీ భారం కానప్పుడు 
నేను ఒంటరిని కానని
ఈ భూమినేమీ నేను మొయ్యడం లేదని
నన్ను నేను నొప్పించుకోవడం ఎందుకని!?

చుట్టూ కట్టుకున్న కట్టుబాట్ల తాళ్ళను తెంపుకుని
ముందుకు కదిలితే ....
ఎన్ని అరుణోదయాలో, ఎన్ని కాంతి కిరణాలో
అడవిలో చెట్లు .... పూలు పూస్తూ
గాలి పలుకుల్ని వింటూ తలలూపుతుండటాలు  
వయ్యారంగా సాగరమే గమ్యంగా కదిలే నదులు
గర్వంగా తలలెత్తుకుని ఎదురయ్యే శిఖరాలు
పగలు నవ్వుతుందేమో అన్నట్లు ....

వేసిన అడుగు వెనక్కు తీసుకోని నాడు 
నీరసపడని నాడు
ఆశ ఉంది. గమ్యమూ ఉంది
పురోగమించితే ....
ముందుకు ముందుకు ముందుకే
స్వచ్చమైన స్నేహ అనురాగాల ప్రోత్సాహం
పరిశీలించి, విశ్లేషించి .... మరీ ఎదురొస్తుంది
చూసే కళ్ళలో బాహ్య ప్రపంచంలోనే ఉంది అందం అని

చివరికి అంతరంగంలోకి చూస్తే
లో లోతుల్లోకి
ఆలోచనలు అవగాహన
మది ఎదల సంతులనం
రాగయుక్తతను చూస్తే
అందంగా స్వచ్చంగా .... అక్కడ జీవితం
నవ్వు పలుకరింపులతో 
ఆనందం అనుభవమైన పరవశింపులతో .