గట్టిగా పట్టుకునైనా ఉండాల్సింది.
పోనివ్వకుండా ఎటూ ....
అప్పుడు వెసులుబాటిచ్చుండాల్సింది కాదు
ఎలాంటి భారమూ ఉండరాదనుకుంటే
ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి?
విఫల ప్రయత్నం అని తెలిసీ పోరాడుతున్నావు
గతం ను మర్చిపోయే విఫల ప్రయత్నం చేస్తున్నావు
కొన్ని ఆశలు అనుభూతులు అంతే
అసంపూర్ణమనే
మర్చిపోలేని నిజాలు అంగీకరించక తప్పదు.
ఎవరి ప్రస్తుత స్థితికి వారే కారకులు
ఆశక్తత అస్థిరత తో కోల్పోయిన రోజుల్ని
గణించుకుంటూ నిస్తేజుడివై ఉండే కన్నా
తెలిసింది చెయ్యగలిగిందీ చెయ్యడం లో
వర్తమానం వికాసం ఉందని గుర్తుంచుకో
ఏ వైఫల్యాన్నీ అంతగా పట్టించుకోవాల్సిన
అవసరం లేదు గుండెకు .... అనుకుని
సందేహాలను పక్కకు నెట్టేసి
కదలాలని నిర్ణయించుకో
ఎవరి బలం వారిలోనే ఉందని తెలుసుకుని
గతం అనుభవాల్లొంచి గుణపాటం ఉంటే
నేర్చుకోవాల్సింది పోయి
మనసు భారం తగ్గుతుందనే బ్రమ లో
మనో ఫలకం పై మానసి చాయల్ని
తుడిచెయ్యాలనుకోవడమే పెద్ద తప్పు
నింపాదిగా మనసును పరిచి చూడు
భావోద్వేగుడివి కాకుండా .... ఆలోచించి
నీ మానసి శ్రేయస్సే నీ ఆకాంక్షైతే ....
నీ సామర్ధ్యం నీ బలమే నీకు తోడ్పడేదని
అది ఎప్పుడూ నీలోనే ఉంటుంది కనుక
No comments:
Post a Comment