Tuesday, August 30, 2016

జీవితం సరిహద్దుల్లో



నీతో అతుక్కుపోయిన నా ఆత్మను
తిరిగి పొందేందుకు, నిన్ను తెలుసుకునేందుకు 
చనిపోయినా పర్వాలేదనిపిస్తుంది.
నీతో కలిసి ఉండేందుకు
ఈ హృదయాన్నిచ్చెయ్యాల్సొచ్చినా

నిన్ను అర్ధం చేసుకోవడానికి
జీవితాన్నే పరిత్యజించాల్సొచ్చినా
నేను ఎంత లోతుగా, ఎంత ఘాఢంగా
నీ జతను కోరుకుంటున్నానో
నీకు తెలిస్తే చాలు అని
ఆశలు కలలన్నీ నీతో ముడివేసుకుని అని

నిజం మానసీ!
ఈ గుండె కొట్టుకునేది నీ కోసమే 
నేను శ్వాసించేది నీ కోసమే 
ఈ నరనరాల్లో
రక్తం ప్రవహించేది నీ కోసమే

ఎందుకో మరి నేను ఏ వాగ్దానానికో
ఏ కర్మ బంధానికో బంధీనౌతున్నట్లుంటుంది. 
నిన్ను ముద్దాడాలనిపించిన ప్రతిసారీ ....
మనది ఎన్నో జన్మల బంధం లా
ఎల్లప్పుడూ నీడలా నీతొనే ఉండాలనుకునేలా

నన్ను ప్రేమిస్తున్నాను అంటావు ఎప్పుడో
అప్పుడే దాగుడుమూతలు ఆడుతున్నట్లు
మాయమౌతుంటావు. 
అందుకే నీతో ఉండీ సర్వం శున్యమైనట్లు 
ఏకాంతం లో ఉన్నట్లుంటుంది.

ఓ మానసీ! నేనున్నది నీ కోసమే
ఈ జీవితం జీవించుతున్నది
నీతో ఉండీ
ఏకాకినైనా అదే భాగ్యం అని
ఒంటరి మరణం పొందినా

నా శరీరమూ అరచేతులు
చెమట తో తడిచిన శీతలత్వం 
కళ్ళముందు ఇంద్రధనస్సు మెరుపులా  
అనూహ్యమైన నొప్పి భయం
ఏ వాగ్దానమో ఎడబాటో ఊహించుకుని 

ఈ ప్రియభావన ముళ్ళ కిరీటం తో
నాకు నేనొక అమాయకపు చక్రవర్తినిలా
నాలుగు రోడ్ల కూడలిలో .... నీ ప్రేమ కోసం
దారి తెలియక .... మరణమార్గం వైపు
పరుగులు తీస్తూ ఆగినట్లుంటుంది. 

ఇప్పుడు ఈ జీవితం ప్రసాదంగా
నీ ముందు ఉంచుతున్నాను .... మానసీ!
మరో సారి సవినయంగా మనవి చేసుకుంటూ
నా మరణం మనల్ని విడదీసేవరకూ
నీవే నా అన్నీ అని విడమరుచుతూ

No comments:

Post a Comment