చెబితే నీవు .... "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని
ఆ హామీ ఆనందం తో
నా గుండె పరిపూర్ణంగా నిండి
పరిత్రాణం పొందాలని ....
నీ మృదు బాషణలతో
నీవు నా విరిగిన గుండె ను చక్కదిద్దాలని
అఘాదాల్లోకి జారిన
నా జీవన జాతకాన్ని రహదారిలా మార్చాలని
మూడు సాధారణ పదాలతో
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని నీవు చెప్పాలని
నీ పదాల మాటల్లోని
ఆ ప్రతి అక్షరమూ శిలాక్షరమై శిలాశాసనమౌతూ ....
No comments:
Post a Comment