నేనొకవేళ నా శరీరంలో దాచేసుకున్నా
నీ ఆలోచనల్ని
మన నివాసం చుట్టూ అల్లుకునున్న మంటలు
మనల్ని ముట్టెయ్యక తప్పవు
ఎవ్వరమూ ఏమీ చెయ్యలేము.
నిస్తేజులమైపోవడం మినహా
మనల్ని మనం ఎలా భద్రంగా ఉంచుకోవాలో
అసలు విశ్రమించే వీలు కల్పించగలమో లేమో
అందుకే నేను ఇప్పుడు ఒక కత్తితో
మన ఆలోచనల కొమ్మల్ని కొన్నింటిని
భద్రంగా కత్తిరించుతున్నాను. వాటి అంటుల్ని కట్టి
పక్కనే వాటితో పానుపు ఏర్పరిచేందుకు
ఆకాశం ఎదురుచూడదు
ఎప్పుడూ ఎవరికోసమూ ఎందుకోసమూ
అది వర్షించుతుంది. ఎండల వేడిమిని
చలి మంచులను విస్తరించుతుందే గాని
ఈ సుందర రమణీయ ప్రకృతి లో
ఈ ఋతుమయ ఆవాసజీవనం లో
ఈ సుందర ఆనందాల నిలయాలయం లో
మమైకమైన పక్షులమై కలిసుండిపోతే .... మనం
No comments:
Post a Comment