ఏ చీకటి నీడలలోనో అస్తిత్వాలను కోల్పోయి
విరిగిపోయిన కలలతో మిగిలి
పొగలా మారిన నిశ్శబ్ద రోధనల మంటలలో
కాలిపోతున్నప్పుడు ఎవ్వరూ సహకరించరు.
నీది ఎంత ఎదురు చూపుల తపనైనా
గాయాలు నొప్పి మినహా
ఏవీ నీ చీకటి భయాలను పారద్రోల లేవు.
నీ కళ్ళు రక్తం స్రవిస్తూనే ఉంటాయి.
అలసీ, నీవు పరుగులు తీస్తూనే ఉంటావు.
గుడ్డితనం అవివేకానికి దారి చూపిస్తున్న
జీవన సరళిలో, అన్నీ కోల్పోక తప్పని అభాగ్యత
మరణం తప్ప మరేది మిగలని దుర్దశ ....
అవివేకం మూల్యం చెల్లించుకుంటున్నామనే
అవగాహన, నీకైనా నాకైనా
బహుశ అంపశయ్యను చేరాకే తెలుస్తుందేమో
No comments:
Post a Comment