Monday, August 29, 2016

ఎలా!?



బహు సాధారణ వేషధారణ
నిరాడంభరత, ఆకర్షణ
ఖచ్చితమైన సంకల్పము
పొంగిపోతున్న ఉత్సాహం
సామర్ధ్యం, తెలివి, ఆశావాదం ....

కళ్ళముందు నిండు జీవితం
అవకాశాల మయం .... ఎదురుచూస్తూ,
ఎన్నో వెళ్ళవలసిన స్థలాలు
ఎందరో కలవవలసిన మనుష్యులు
కలలు నిజం చేసుకునే జీవన క్రమం లో

వేగవంతంగా కాకపోయినా
ప్రతి ఒక్కరికీ .... మనలో
ఒక అనుచిత విధానం అంటూ ఉంది.
పుట్టిన స్థితిగతులు, వాతావరణం
పెరిగిన సామాజిక నడవడిక లో

తుప్పు సాంప్రదాయాల సంకెళ్ళు కొన్ని
తెంచేసెయ్యాలనుంటుంది. కానీ
సామాజిక అంచనాలు, సంకోచాలు 
అతిక్రమించని మంచి మనిషి అనే  
పేరుకు మచ్చరాని విధంగా .... ఎలా!?

No comments:

Post a Comment