ఈ వింత భావన నాలో
ఊహల్లో .... గాలిలో నడుస్తూ ఉన్నాను.
ఆలశ్యంగా అయినా ఒప్పుకుంటున్నాను.
అది యాదృచ్ఛికం కాదు ....
అన్ని సందర్భాల్లోనూ
నీవైపు ఆకర్షితుడ్నౌతున్నాను అని.
ఊరంతా అనుకుంటుంటున్నారు.
ఓ మానసీ .... ఇంతందంగా ఉన్నావు.
నీ మనసు నీ లో లేదు అని
నాకెందుకో మరి మరోలా అనిపిస్తుంది.
నా కళ్ళకు నీ కళ్ళలో నక్షత్రాలు, తారలు
ఆనందం విరబూసిన ఆకాశం కనిపిస్తుంది.
కలిసి జత రమ్మంటే మన్నిస్తావు అనిపిస్తూ ....
నీవైపే తూగుతూ వేగంగా కొట్టుకుంటుంది.
నా హృదయం తనదైన చక్షువులతో నిన్నే చూస్తూ
నీవే తన ఆశలు, కలల గమ్యం లా
తలుపులు తెరిచి
నిన్నే స్వాగతిస్తూ .... నిజం మానసీ
అది ప్రేమ తప్ప మరేమీ కాదు
ఓ మానసీ! ఒట్టేసి చెబుతున్నాను .... ఇదే నిజమని
వింత అబద్రతాభావం తగదని ఆనుకుంటూనే
నీవెక్కడ చెడుగా అనుకుంటావో అని ....
తొందరపాటు .... నా మనస్తత్వం కాదు కానీ
ఎందుకో నీవు ఎదురుపడిన వేళల్లో
నిన్ను ఒదిలి తిరిగి వెళ్ళాల్సొచ్చినప్పుడు మాత్రం
వెళుతూ వెళుతూ వెనుదిరిగి
మళ్ళీ ఒకసారి చూద్దాం అనిపించడం నిజం
ఈ ఉద్దేశ్యాలు నా ఈ మనోభావనలు అన్నీ
నీపై బలమైన ముద్ర వేద్దామని మాత్రం కాదు
అంత సులభమనీ అనుకోను.
ప్రేమ, ఒక అమూల్య బహుమానం అని
ఎదురుపడినప్పుడు తిరస్కరించరాదనే ....
ఈ తపనంతా. ఎక్కడ చేజార్చుకుంటానో
అమూల్య బహుమానమైన నిన్ను అనే ....
No comments:
Post a Comment