Tuesday, November 10, 2015

ప్రేమలో పడితే


ఎవరినైనా నీవు ప్రేమించితే
ఏమైనా చెయ్యాలనుకుంటావు.
ఎంతకైనా తెగించాలనుకుంటావు.
అది భేషజమూ అనర్ధకారమే అయినా సరే

చంద్రుడ్ని కోసుకొస్తానంటావు
సూర్యుడ్ని కనబడకుండా చేస్తానంటావు
నిజాలకు వాస్తవాలకు దూరంగా
అబద్దాలలో జీవిస్తుంటావు.

ఎవరినైనా ఘాడంగా ప్రేమిస్తే
ఎన్నో పిచ్చి నమ్మకాలతో .... నిజంగానే
గగనం లో ఎగురుతున్నట్లు 
వింత వింత కలలు కంటుంటావు.

నీకు తెలియని నిజం
నీ ఒంటరి రాత్రుల విరహపు
గడియలు ఇక మొదలుకాబోతున్నాయని 
నీకు తెలియకపోవడమే 


అంతరాంతరాల్లో అంటుతావు
ప్రేమ విత్తుని
ఒక పాదును .... చుట్టూ
బలమైన పెన్సింగ్ కడుతుంది, మనసు

ఎవరినైనా నీవు కోరుకుంటే
తప్పనిసరి జీవనావసరం అనుకుంటే 
అది ప్రేమే అనిపిస్తుంది .... ప్రేమిస్తావు.
అన్నీ కోల్పోవడానికి సిద్దపడతావు.

రేపును గురించిన ఆలోచన ఉండదు
నిన్ను నీవు కోల్పోవడానికీ సిద్దమౌతావు.
ఆ సూర్యుడివి నీవే నంటూ 
చంద్రుడివై వెన్నెల వెదజల్లాలనుకుంటావు.

ప్రేమలో పడితే .... యువతా!

No comments:

Post a Comment