ప్రతిదీ అవసరం అని
అనుకోను .... ఇకపై
ఏదీ నాదని
ఇళ్ళూ, స్తలాలు
డబ్బు, సౌకర్యాలు
మూల్యతలు
సొంతం కానక్కర్లేదు.
ఆకలి తీరితే చాలు
చుట్టూ నిశ్శబ్దం పరుచుకుని
అద్దంలో ప్రతిబింబం
రోజు రోజుకూ మసకేసినా,
నాకు నీవు నీకు నేనూ
ఎప్పుడూ సొంతం కాలేదు.
కనీసం ఎప్పుడూ
నా, నీ పిల్లలు అనుకోలేదు.
మన అని,
అన్నీ అంతే
కాలం కరుగుతూ
జ్ఞాపకాలుగా మారిపోతూ
ఆ జ్ఞాపకాలే
చాలు అనుకుంటే చాలు.
చివరికి మిగిలేది మాత్రం
పదరూపం లో
అందంగా
అక్షరదోషం లేని భావనలేనేమో
ఈ మృదుస్పర్శలు
ఈ మౌనం వినడాలు
ఈ రంగులద్దిన పెయింటింగ్సూ
అనాలోచితంగా మనస్సును
పారవేసుకోవడాలు
నిట్టూర్పుల్లేకుండా
త్యాగాలు చేయడాలు
No comments:
Post a Comment