Tuesday, November 3, 2015

నీవే నా అన్నీను


నీవే
నా ఉదయానివి
అస్తమయానివి, నేను
ఎంతో ఇష్టంగా పాడుకునే పాటవి
రాసుకునే భావానివి
కావ్యానివి.
నీవే .... నా అన్నీను

నీవే
నా కళ్ళలో మెరుపు
ఆ మెరుపు వెలుగువి
నా ప్రకాశం
నేను, నా సొంతం అని
చెప్పుకోవాలనిపించే
ఏకతత్వానివి

నీవే
నా పలుకువి
గొంతు ఆవేశానివి
నా వినికిడివి
నా అంతరాత్మవి
ఊహించేలపోతూ
నీవు లేని జీవనం 


నీవే
నా కలల గమ్యానివి
నా హృదయాన్ని నేను
అనుసరించేందుకూ
మన మధ్య బలపడిన
హృదయానుబంధం
కారణానివి

నీవే
నా మధ్యాహ్నానివి
నా అనుక్షణపు ఆలోచనవి
నేను పలికే
తియ్యని, సున్నిత
మృధు పద బాష్యానివి

నీవే
నేను కోల్పోయిన
నిద్దుర రాత్రివి
నీవే నా ఆత్మవి
అస్తిత్వాన్ని కోల్పోయిన
నా ఆవేశం అర్ధానివి

నీవే
నా హృదయానివి స్పందనవి
ప్రతిరోజూ ఆ దేవుడికి
కృతజ్ఞతలు చెప్పుకుని
ప్రేమను తపించడానికి
కారణానివి

నీవే
నా నిత్య దినచర్యవు
నా ప్రతి రాత్రివి
పోట్లాడకుండానూ
దగ్గరకు తీసుకోకుండానూ
ఉండలేని నా మానసివి

No comments:

Post a Comment