నీవు తిరస్కరించావు.
నాకింకా గుర్తుంది .... నీవన్నావు.
"ఎప్పటికీ నా జీవన భాగస్వామిగా
అంగీకరించలేను .... నిన్ను" అని
నేను పెట్టుకున్న .... ఎన్నో ఆశలు
కన్న ఎన్నో కలలు, కూలి
జీవితం ఇలా సాగక తప్పదనిపించి .
గుండె బ్రద్దలయ్యింది.
అవకాశం లేదని స్పష్టంగా తెలిసి
గుండెల్లో లోపల ఎక్కడో అజ్ఞాతంగా
ఏదో గుచ్చుకున్న బాధ .... ఎప్పుడూ
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన
రాలేదు కానీ,
ప్రేమించి భంగపడిన తియ్యని బాధ
భరిస్తూనే జీవించక తప్పని స్థితి
అప్పుడే నిర్ణయించుకున్నాను.
జరిగిపోయినదంతా గతం అని
గతం గతించిందని
నాకు నేను చెప్పుకుంటూ జీవించాలని
ఏ కోణం లోంచి ఆలోచించినా
నీ నిర్ణయం సబబే అనిపించేది.
నీవు నాతో అన్నావు మరిచిపోయుంటావు.
"నేను నీకోసం పుట్టలేదని
నీ తల్లిదండ్రుల దృష్టి లో
నేను నీకు తగినవాడిని కాదని"
మనం ఒక్కటైనా
మన దాంపత్య జీవితం
సరళంగా, ఆనందంగా, ఆదర్శవంతంగా
జరిగే అవకాశం లేదు అని
ఆ మాటల్లో విని అనాసక్తిని
కానీ తరువాత వెనుదిరిగి ఆలోచించాను.
అప్పుడు ఆ సంఘటన అప్రస్తుతం
మరిచిపోవాల్సిన గతం లా అనిపించింది.
అంతేకాదు
అనుకోకుండా రేపు ఎప్పుడైనా
ఏ టాంక్ బండ్ మీదో
నీవు నాకు ఎదురుపడినా
ఒకప్పుడు నేను ఎంతో ఇష్టపడిన నీ ముఖం
తెలియని ముఖం అన్నట్లుండేంతగా
మనం అందరమూ అనుకుంటున్న
ఈ ప్రేమ, ఈ హృదయబంధం
ఏ అద్భుతమూ ఆనందమూ కాదు
అప్పుడప్పుడూ అది మానసిక అశాంతిని
కన్నీళ్ళనే మిగులుస్తూ ....
నేను అన్నీ భరించే జీవిస్తున్నాను
హృదయం పగిలినా కూడగట్టుకుని
ముందుకే కదులుతున్నాను.
మళ్ళీ ప్రేమను కనుగొనగలననీ
ఆనందాన్ని తిరిగి పొందగలననే
ఆనాడు నీవు నా ప్రేమను నన్నూ
దూరంగా విసిరేసి
చాలా మంచిపనే చేసావు.
నీ నిర్ణయం ఎంతో ఉత్తమమైనదే
నీకూ నాకూ కూడా
బహుశ ప్రేమను పొందేఉంటావు
ప్రేమను కనుగొనాలని కోరుకుంటున్నాను
ఆనందాన్ని, ఆత్మసహచరుడ్నీ పొందాలని
నిజం మానసీ .... నీకు
కొన్ని వేల లక్షల కృతజ్ఞతలు
నీ జ్ఞాపకాల పూతోటలో విరిసిన
పరిమళాలింకా మిగిల్చుంచినందుకు
No comments:
Post a Comment