నేనేకాకిని ఒంటరిని కానప్పుడు?
జరగబోయేదేదీ తెలియకపోయినా
జీవించడం పోరాటమే అయినా
ఇప్పటివరకూ .... నాకు తెలుసు
నేను కాలం కొండను డీకొట్టి
పోరాడుతున్నాను అని
అనుక్షణమూ నమ్మకమే ఊపిరిగా
చివరికి అంధకారం లోంచి ఆరు బయటికి
వెలుగులోకి రాగలిగాను ....
పట్టపగలు .... అంతా వెలుగుమయం
ప్రేమే నన్ను కాపాడింది ఇన్ని నాళ్ళూ
ఇక పునరారంభం నా చేతిలోనే ఉంది
నీ జతనై నీడనై నీ భాగస్వామి గా
కష్టాల్లో సుఖాల్లో
నీ చెయ్యందుకుని అడుగులో అడుగులేసేందుకు
నాకు తెలుసు .... గమనం సుసాధ్యం కాదని
సమశ్యల హర్డిల్స్ దాటడం కష్టసాధ్యం అని
కానీ, పక్కన ఊపిరివై నువ్వున్న బలముంది.
తలొచక్కర్లేదు ఇకపై నిలబడే ఉంటాను
ఎప్పటికీ నేను .... ప్రేమ శిలా ఫలకం పై
నీ ప్రేముందనే దృడ నమ్మకం మీద ....
ప్రేమేగా నువ్వాశించేది నేనివ్వగలిగింది
No comments:
Post a Comment