Thursday, July 18, 2013

సహ జీవన మాధుర్యం కోసం



ప్రతి ఒక్కరిలానే నేనూ శోధిస్తున్నా
జీవన ఆనందం కోసం!
నా గురించి చెప్పేందుకు నుతనంగా ఏమీ లేదు.
ఎప్పుడూ మంచివాడ్ని, రాముడ్ని .... అప్పుడప్పుడు రాక్షసుడ్ని, రావణుడ్ని
అదే ప్రేమ విషయానికి వస్తే నేను కేవలం ఒక అవివేకిని.
ప్రేమ కోసం,
నేను పర్వతాలు అధిరోహిస్తాను, సముద్రాలు ఈదుతాను.
నా శోధన
ఏ దేవతా స్త్రీ కోసం కాదు.
నన్నర్ధం చేసుకుని,
నా సాహచర్యం లో సురక్షితంగా ఉండే ....
ఓ నిజమైన నేస్తం, నిజమైన ప్రాణసఖి కోసం.

ఓ పిల్లా! దూరంగా పారిపోవాలనున్నా పారిపోలేవు.
నా మనో సంకల్పం
మన వివాహ మహోత్సవానికై ఉర్రూతలూగుతూ .... నేను.
...............
నేను ఇప్పుడు నా భవిష్యత్తును చూస్తున్నాను.
నా జీవన భాగస్వామిగా నిన్నే చూస్తున్నా!
నేను నీ చెయ్యందుకున్నప్పుడు, నీ ఆనందంలో నా మనోల్లాసాన్నీ,
నీ వణుకుతున్న వేళ్ళ కుదురులేనితనంలో,
నా గుండె ప్రకంపనల్ని ..... చూస్తున్నాను.
నీ అందమైన ముఖాన ఆ మేలి ముసుగును తొలగించి,
నిన్ను ఇంటికి తీసుకొని వెళుతున్నట్లు,
ఈ అడవి, బ్రహ్మచర్యాన్నొదిలేసి, నిజమైన సహచర్యం ప్రేమను పంచి ....
పొందుతున్నట్లు .... నీ ద్వారా సాహచర్య మాధుర్యాన్ని.

కాలం కోలుకోలేని హాని శారీరకంగా చేసిన తర్వాత కూడా,
నీవూ, నేను చేతిలో చెయ్యేసి, నెమ్మదిగా సాయంత్రాలు నడుస్తుండటం,
గువ్వల్లా మన జంట సహజీవనం సాగిస్తుండటం ను
నా కళ్ళ ఊహల్లో చూస్తూ ఉన్నా!
నాకు ఎల్లప్పుడూ నీ వంటే అదే ప్రేమ ఉన్నట్లు,
నేను నీ కళ్ళ లో వెతికినప్పుడు .... ఎప్పటికీ ఆ స్పార్కే చూస్తున్నట్లు,
నీడలు వాలే వరకూ, గదిలో చీకటి జొరబడేవరకూ
నేను ఈ భూమి వదిలాక్కూడా ....
ఏ అప్సరసలు ఎదురొచ్చినా ....
అక్కడ నా నిజమైన సహచరి కోసం వేచి చూస్తూ ఉంటున్నట్లు
ఓ పిల్లా! నా నిజమైన సహచరి కోసం .... నిజమైన నీ కోసం ఎదురుచూస్తున్నట్లు.

No comments:

Post a Comment