Friday, July 19, 2013

ప్రేమోదయం!


ఆకాశం భగభగా మండుతోంది.
నక్షత్రాలు తగులబడుతున్నాయి. 
నా ఈ రాత్రి అభిరుచి లా, నెమ్మది గందరగోళం నువ్వూ నేనూ లా ....
మనం ఎన్నడూ ప్రయాణించని మార్గంలో, 
ఇప్పుడు ఇక్కడ మనం ఒంటరి ప్రాణులం!

నా జీవితంలో నీవు ఒక్కరివే! 
ఏ విషయమూ నీకన్నా ముఖ్యం కాదు 
నాకు ఈ రాత్రి .... నీతో సంతోషంగా గడపడం మినహాయించి 
ఏదీ ముఖ్యం కాదు .... సూర్యోదయం వరకూ 
పిల్లా! నీవూ నేనే ఈ జగతిలో కాలంతో పోరాడుతూ .... ఒంటరిగా,

పిల్లా! దగ్గరగా రా, నా గుండెను స్పర్శించు! 
నా ఊపిరి అనుభూతిని పొంది చూడు!
మానసిక స్వేచ్చ దొరికి, ప్రేమ మార్గదర్శని అవుతుంది. 
ప్రియా! నేను జారినప్పుడు నీచెయ్యి అందించు. 
ప్రతి స్పర్శ, ప్రతి కదలిక లోనూ నిఘూడంగా ఉన్న శక్తి ని పొందుదాం.

అందు కోసం ఒక జీవితకాలాన్ని వృదా కానీయ్యొద్దు! 
ఆ మధురమైన అనుభవం కోసం?
ఆత్మ తో ఆత్మ, కంటి తో  కన్ను కలిపి ఏకాత్మ, ఏకదృష్టి తో 
ఇంద్రధనస్సు రంగులన్నీ ఒక్కటయ్యేలా కలిసి ప్రయాణిద్దాము 
మనమధ్య ఏ విభజన రేఖలూ లేని అంచు వరకూ,

అదిగో అటు చూడు నీటి మీద ఆ చంద్రుడు, 
అలలకు వెన్నెల దారం కట్టి లాగుతున్నాడు .... అది పోటు! 
ప్రేమ అనే మహాసముద్రం లో ప్రేమ .... ఆత్మల్ని పరిశుద్దం 
ప్రక్షాలణ చేస్తుంది. కోరికల సుడిగుండంలో చిక్కుకున్న మనల్ని,
ఈ క్షణం కోసమే నా జీవితమంతా వేచి చూసింది ..... ఈ ప్రేమోదయం కోసమే!

No comments:

Post a Comment