లోతుగా
పాతాళంలోకి లా
ప్రేమలోకి .... జారిపోయా
అక్కడ
ఎటు చూసినా నువ్వే
నీ నవ్వులే
నీ ప్రేమ ఊపిరులే
నేను
ఎన్ని జన్మాలుగానో తపించిన
కలలుకన్న జీవితం లా
రాత్తిరి కరిగిన
ప్రేమోదయం లా
నా కళ్ళముందు గమ్యంలా నీవు
ఇష్టం
నవ్వుల్ని, పువ్వుల్ని
సాటి మనిషి ఆనందంలో
తన ఆనందం దాచుకోవాలనిపించే
రహశ్యం ప్రేమైనట్లు
ఏవో బంగారు కాంతులు
పరుచుకుంటున్నట్లు
సున్నితమైన గోరువెచ్చదనం
ఉదయం ఒకటుందని
కళ్ళుతెరిచేవరకూ
నేనెరుగను
ఆ అద్భుతం నీవని
ఊహలకు
రెక్కలు పుట్టుకొచ్చి
శరీరం తేలికైపోయి
పక్షిలా
నేను ఎగురుతున్నట్లు
నా ఏడుపు
నాకు స్వచ్చంగా వినిపిస్తూ
నేను
గాల్లో తేలియాడుతున్న క్షణాల్లో
నేనెరుగను
ఆ ఉపశమనము
ఆ ఊరట
చెయ్యందించిన
ఆ అమృతహస్తం నీవని
లోతుగా
ఇంకా లోతుగా
నా అంతరంలో ....
అక్కడ పాతాళంలో
ఎటు చూసినా నువ్వే
పువ్వై నీవు పరిమళిస్తున్న నవ్వులే
నీ ప్రేమ ఊపిరులే
నీదీ, నాదీ
ఎన్నో జన్మల అనుబంధంలా
నీనుంచి నాపైకి
ఆ బంగారం కాంతులు
సూర్యోదయం కిరణాల్లా
నీ స్పర్శ లా వెచ్చగా తాకుతూ
కళ్ళుతెరిస్తే
కళ్ళ ముందు
బెడ్ కాఫీ తో నీవు.
No comments:
Post a Comment