Wednesday, July 31, 2013

వానాకాలం


గుండె 
వేగంగా కొట్టుకుంటుంది,
చలికి 
గడగడవణుకుతూ, 
మేఘాలు ....
ఆకాశంలో నర్తిస్తూ, 
వర్షించేందుకు సిద్దంగా ఉన్నాయి.
ప్రకృతి, పురుషుడు 
హృదయచాలనం అది 
పరస్పరం ప్రేమలో తలమునకలై .... 

మసకమసక చీకటి

విచారం
భావన, అలసట ....
శరీరం బాష అయి,
ఆమె ముఖంలో ....
ఒక లోతైన పర్యాలోచన, 
ఆమె కళ్ళు,
చీకటి లో ....
చీకటి లక్షణాలు అనుకరిస్తూ,

Tuesday, July 30, 2013

ప్రేమ!


సూర్యుని చుట్టూ
తిరుగుతుంది .... భూమి
విస్తృత వృత్తాలుగా గాలి.
ఆటు పోటు
అల్ప పీడనల నీరు ....
జీవితం పురోగమనం
జీవులన్నిటి
జీవనాధారం, మూలం
ప్రేమ!

జ్వాలలు వెలుగులు యిక


నిలకడగా
ఆడి, కొట్టుకొంటూ
ఉద్యమాల జ్వాలలు
కొన్ని ....
గాలిని, ఆకస్మికంగా పడే వర్షాన్నీ
ఏమార్చి
ప్రకాశవంత
వెలుగులు గా
పరిణామం చెందుతాయి.
చరిత్రలో,

ముగింపు


అతి శీతలం గా ఉంది.
ఒంటరితనం,
ఒక ప్రేయసి నోటి పునరుక్తి లా 
పంచభూతాలు.
మళ్ళీ మళ్ళీ పలుకరిస్తున్నాయి. 
వేడిగా లేని ఈ వెన్నెల లా

నా బాధ

బలహీనపడి జ్ఞాపకాలు 
పగిలి .... 
కలలు కలవరాలు 
కాలి బాట పై 
కురుస్తూ ఆ అప్సరసల
కన్నీరు తడి

నా ప్రేయసి

అమాయకత్వం, 
ఆకర్షణ 
పారదర్శకత 
అందం,
ఒక లక్క.బొమ్మ 
ఆమె

వెన్నెల పూస్తుందని

చాపక్రింద నీరులా 
చీకటి అల్లుకుపోతుంది. 
సన్నగా, మంద్రంగా 
సంగీతం వినిపిస్తుంది. 
జీరో వ్యాట్ బల్బ్ 
గోడమీద .... 
వెలగనా వొద్దా అన్నట్లు 
వెలుగుతూ, గది నిండా 
నీడలు పరుచుకుంటున్నాయి. 
నా గుండె 
వేగంగా కొట్టుకుంటుంది. 
కేవలం నీవూ నేను .... నేనే అని,

రేపు కలుద్దాం! 
ప్రతిదీ ఆహ్లాదకరం, 
ప్రకాశవంతంగా .... ఉన్నప్పుడు,
అప్పుడే కలుద్దాం. 
వద్దు! ఇప్పుడు కలవొద్దు! 
రేపే కలుద్దాం! 
ఎందుకంటే, 
రేపు, నేను వెన్నెల 
తప్పకుండా ఉంటుందని 
నమ్ముతున్నాను.
నీవూ, నేనూ 
వాకింగ్ కు వెళతామని,  
వెన్నెలను ఆస్వాదించుతామని,

భవిష్యత్తును చూడలేను, 
నేను .... 
సంవత్సరాల దీర్ఘదర్శిని కాను. 
నీకూ తెలుసు 
కాలం ....
ఎందరో మధ్యం బానిసల్ని చూసిందని 
ఇప్పుడు, వెన్నెల దారిలో  
కాలం గడుపుతూ 
మన నవ్వుల వలయీకరణతో ... 
వెన్నెల తాగే మనలో 
ఓ వింత బానిసల్ని చూస్తుంది. 
నీవు నాపక్కన ఉన్నప్పుడు 
కాసింత సమయం నీవు నాకిచ్చినప్పుడు,

రేపు ఏం జరుగుతుందో? 
నాకు తెలియదని నీకు తెలుసు. 
జీవితం నన్ను నడిపిస్తున్నవైపు .... 
నడుస్తుంటానే తప్ప. 
నిజానికి, 
మనం ఎప్పటికీ కలిసి ఉంటామని 
నాకు .... ఒక పిచ్చి విశ్వాసం! 
అదే నన్ను నడిపిస్తుంది. 
నా ప్రేమ సఫలం అవునో కాదో 
నాకూ తెలియదని 
తెలిసిన నీకు తెలుసు. 
విన్నవించుకుంటున్నా ప్రియా! 
ఈ రాత్రికి నీవు రావొద్దు! రేపు రాత్రికే కలుద్దాం!

ఈ సృష్టి లో
ఏదైనా 
జరగాల్సిన విధంగా 
జరిగి పోతున్నంత కాలం 
వేచి చూద్దాం! 
రేపు అనేది ఉంటే 
ఈ రాత్రి లానే రేపూ 
మనం సంతోషంగా ఉందాం! 
రేపటి వెన్నెల రాత్రిలో 
వెన్నెల్లో తడుస్తూ 
కలిసి నడుద్దాం. 
వెన్నెల తాగుతూ,

చుట్టూ 
చీకట్లు ముసురుకుంటూ, 
సన్నగా 
మంద్రంగా ....
వడపోసిన సంగీతం వినిపిస్తుంది. 
ఊహలు 
ఊపిరితిత్తుల్ని నిండి .... 
తనువు, మనసు 
గాల్లో తేలిపోతున్న భావన., 
నాకు నిద్దురముంచుకొస్తూ,
సమాధానాలు అవసరం లేని 
ప్రశ్నలే అన్నీ 
ఈ రాత్రి ఆనందోల్లాసాలు 
మన రేపటి ఊహలు
కేవలం నీవూ నేనూ ....
వెన్నెల విహారం చేసేస్తామని.

Monday, July 29, 2013

పిల్లా!

ఒక చల్లని గాలి తెమ్మెర 
రేకుల్ని తాకి  
ఎర్రబారిన 
ఒక గులాబీ బాల (మొగ్గ), 
బిడయంగా 
తలొంచుకుంది
ఆ మొగ్గలో నిన్ను చూస్తున్నా!

ఆకర్షణ

స్వేచ్చగా గాలికి 
ఎగురుతూ
ఆ జుట్టు పోగు పరిమళాలు
ఆ నీలం రంగు కళ్ళ చూపులు
అంతటా పడిపోతూ
నా మనసులో వింత అలజడి 
గమనించబడాలని ....
ఆమె నవ్వుతూ ఉంది.

చిత్రం!

గుండె 
వేగంగా కొట్టుకోవడం  
శరీరం 
గడగడవణకడం 
అర్ధం కాని 
అలజడి 
ఆకాశం
మెరవడం 
మేఘాలు నర్తించడం
ఔనూ! 
ప్రేమ కు ఇంత మహిమా!

దూరపు కొండలు



ఎవరు చెప్పినా 
సారం ఒక్కటే 
తిరస్కరించబడిన పండు 
తియ్యగా 
రుచికరంగా ఉంటుందని 
అందని ద్రాక్షలా
బాధ తియ్యగానే ఉంటుందని

Saturday, July 27, 2013

నిజం!


ఇది జీవితం
నీవు జీవిస్తున్నావు.
అంతవరకే చూడు!
ఇక్కడ ఇలలో ....
సుఖాంతాలంటూ ప్రత్యేకంగా ఉండవు.
సుఖించే క్షణాలే తప్ప
మరణం దే తుది తీర్పు!
తప్పదు.
అదే ముగింపు ఎవరికైనా
నన్ను నమ్ము .... నేస్తం!
సంతోషంగా ఎవరూ మరణించరు.
ఇదే నిజం!
బ్రతికున్నన్నాళ్ళూ
ఈ భయంతోనే బ్రతక్క తప్పదు.
కరుగుతున్న కాలాన్నీ
మారుతున్న వాస్తవాల్నీ చూస్తూ బ్రతకాలి.
చివరికి మనిషిగా
నీవూ, నేనూ నేర్చుకునేది మాత్రం
మనం నిమిత్తమాత్రులం అనే నిజాన్ని.

వీడుకోలు


ఒక రోజు
నన్ను నేను గతం లోకి తిరిగి చూస్తే, 
ఎన్నో .... నవ్వు ముఖాలు, 
అమాయకపు చిరునవ్వు పరిమళాలు 
ఆ ఆశలు, ఆశయాలు .... యౌవ్వనపు చైతన్యపు కదలికలు!
ప్రస్తుతం 
వర్తమానంలో కేవలం బాధ, రోదన.
నిజం నేస్తం!
జ్ఞాపకాలకు వీడుకోలు చెప్పడం చాలా కష్టం!

నేరస్తుడు


అతను గాయపడాలి 
నొప్పితో విలవిల్లాడాలి 
ఆమె 
గుండె లోకి చేరినందుకు 
........
దగ్గరకు రాగలిగేవాడు కాదు 
నిజానికి అతను 
అతని గతం నిజం
నేర చరిత్ర ముందుగా ఆమెకు తెలిసుంటే,

Friday, July 26, 2013

కోకిల

పక్షి పాట 
శ్రావ్యంగా
నా ఊహాత్మక ప్రేయసి
మళ్ళీ సజీవంగా

రసోద్వేగం



పిల్లా! నీ కళ్ళు మూసుకో
ఒక లోతైన దీర్ఘ శ్వాస తీసుకో
నీ హృదయం నా హృదయం తో గుసగుస లు ఆడనీ
నన్ను నన్నుగా ప్రేమిస్తున్నానని చెప్పు! 

నన్ను గట్టిగా పట్టుకో 
నాతో శుభరాత్రి అని చెప్పకు .... తొందరపడకు
అన్నీ సవ్యంగానే జరుగుతాయి. 
పిల్లా! నన్ను గట్టిగా హత్తుకుపో! 

ఆ ఒక్కటి నీ నోట వినాలని 
ప్రేమ మంత్రం .... 
నన్ను ప్రేమిస్తున్నానని .... నా చెవిలో  
నా జీవన భాగస్వామివి, నా తోడువి నీవని, 

నటించాల్సిన అవసరం లేదు.
నేను దేన్నైనా తట్టుకోగలను .... విని, నిజాన్ని
నీ ప్రేమ సామ్రాజ్యం లో నా స్థానాన్ని
పిల్లా! గుండె ఆత్మల పరిపూర్ణ ప్రేమ నాది! 

Thursday, July 25, 2013

ప్రియ బీజ గణితమా

సమస్యలు నీవి
అయినా
నావే అంటుంటావు.
స్థిమితంగా ఉండనీవు.
అసలు ....
పరిష్కారాలు,
సమాధానాలు
ఇన్స్టంట్ గా దొరకవు.
కొని తెచ్చుకున్నప్పుడు అని,
నీకూ తెలుసు!
ఔనూ
కాస్త కష్టపడి,
నీ సమస్యకు నీవే పరిష్కారం
వెదుక్కోవచ్చుగా!

Wednesday, July 24, 2013

అది ప్రేమ



చెప్పేందుకు 
అది 
ఒక పదం కాదు.
ఒక ఆట కాదు 
కాలంతో నిర్వచించలేని 
కనులతో చూడలేని
అద్భుతం! 
మది, ఎద సంతులనమైన,
ఇంద్రియాల చైతన్యం.
ఊపిరి ఆవశ్యకత లేని ఆనందం. 
హృదయోద్వేగం! 
నిన్న, 
నేడు, 
రేపు మరియు ఎప్పటికీ  
నేనున్నానని ఎదురొచ్చే .....
అమృతతత్వం!

Tuesday, July 23, 2013

కలలు!

కలలను ప్రేరేపించే 
జ్ఞాపకాలు, 
ఊహల కాంతి పుంజాలు 
కుశాగ్రబుద్ధి ....
లోలోని ఉత్కృష్ట తలంపు లు ....
కోల్పోయిన ఆశల లక్ష్యాలు  
కదలాలి .... ముందుకు రావాలి .... నీలో

ఆత్మగౌరవం!

నాకు నేను కల్పించుకున్నది. 
పతనానికి ముందు 
వస్తుంది.
ఒక ఎత్తైన కొండ చరియ మీదికెక్కగలిగి, 
ఎవరెష్ట్ ను ....
నేను అనే భావన ....
ఒక ఖరీదైన అలంకారం 
వొదులుకోవడమే కష్టం!

బడబాగ్ని


నీ మృదు స్పర్శ
నిప్పై
రాజుకున్న
కాలుతున్న కోరికల కుంపటి
మత్తును కలిగించే
ఆరని అగ్ని 
కౌగిట్లో ఇద్దరం వొక్కరై 
ఆహుతౌతూ ఉంది ఈ హృదయం

Monday, July 22, 2013

వసంతం


ఒక పువ్వు, 
ఒక సీతాకోక చిలుక
ఈ భూమి, 
ఈ ప్రకృతి కి .... అందం దిద్ది
మనో భావాలను ఆటపట్టిస్తున్నాయి.


హృదయం



లోతుగా
పాతాళంలోకి లా
ప్రేమలోకి .... జారిపోయా
అక్కడ
ఎటు చూసినా నువ్వే
నీ నవ్వులే
నీ ప్రేమ ఊపిరులే
నేను
ఎన్ని జన్మాలుగానో తపించిన
కలలుకన్న జీవితం లా
రాత్తిరి కరిగిన
ప్రేమోదయం లా
నా కళ్ళముందు గమ్యంలా నీవు

ఇష్టం
నవ్వుల్ని, పువ్వుల్ని
సాటి మనిషి ఆనందంలో
తన ఆనందం దాచుకోవాలనిపించే
రహశ్యం ప్రేమైనట్లు
ఏవో బంగారు కాంతులు
పరుచుకుంటున్నట్లు
సున్నితమైన గోరువెచ్చదనం
ఉదయం ఒకటుందని
కళ్ళుతెరిచేవరకూ
నేనెరుగను
ఆ అద్భుతం నీవని


ఊహలకు
రెక్కలు పుట్టుకొచ్చి
శరీరం తేలికైపోయి
పక్షిలా
నేను ఎగురుతున్నట్లు
నా ఏడుపు
నాకు స్వచ్చంగా వినిపిస్తూ
నేను
గాల్లో తేలియాడుతున్న క్షణాల్లో 
నేనెరుగను
ఆ ఉపశమనము
ఆ ఊరట
చెయ్యందించిన
ఆ అమృతహస్తం నీవని


లోతుగా
ఇంకా లోతుగా
నా అంతరంలో ....
అక్కడ పాతాళంలో
ఎటు చూసినా నువ్వే
పువ్వై నీవు పరిమళిస్తున్న నవ్వులే
నీ ప్రేమ ఊపిరులే
నీదీ, నాదీ
ఎన్నో జన్మల అనుబంధంలా
నీనుంచి నాపైకి
ఆ బంగారం కాంతులు
సూర్యోదయం కిరణాల్లా
నీ స్పర్శ లా వెచ్చగా తాకుతూ
కళ్ళుతెరిస్తే
కళ్ళ ముందు
బెడ్ కాఫీ తో నీవు.

అతను, ఆమె


చూస్తూఉన్నా 
ప్రకృతిని ప్రేమిస్తూ ఉన్న .... పురుషుడ్ని, 
ఆ జీవితంలో ప్రకృతి కోసం సమర్పణాభావం కొంతే 
కాని 
ఋతువు ఏదైనా 
ప్రకృతి మాత్రం పరిపూర్ణంగానే ఇస్తుంది 
ఆ భర్తకు ఒక భార్యలా

Friday, July 19, 2013

నిస్సహాయంగా

నిస్సహాయుడిలా,
ఒంటరి ఆలోచనల్తో ....
నల్లని ఆకాశం, మసకేసిన చంద్రుడి పర్యవేక్షణలో.
మౌనంగా ఒంటరిగా 
వరదై వచ్చి కొట్టుకుపోయిన జీవితం, 
కనిపించని గమ్యాన్ని చూస్తూ .... నేను

నేన్నిన్ను కోల్పోతున్నా!

నేన్నిన్ను
కోల్పోతున్నా! 
నీ మాటల భావాన్ని, (మాట్లాడేప్పుడు)
నీ నడక గతిని, (నడుస్తున్నప్పుడు)
నీ కోపం .... 
నీ ముభావాన్ని .... (నువ్వలిగినప్పుడు)

సమబంధం!

కొన్ని నిజాలు 
కొన్ని అబద్దాలు 
సూచికలు 
పునాదికట్టులు 
సంతోషకర వివాహ బాంధవ్యానికి

ప్రేమోదయం!


ఆకాశం భగభగా మండుతోంది.
నక్షత్రాలు తగులబడుతున్నాయి. 
నా ఈ రాత్రి అభిరుచి లా, నెమ్మది గందరగోళం నువ్వూ నేనూ లా ....
మనం ఎన్నడూ ప్రయాణించని మార్గంలో, 
ఇప్పుడు ఇక్కడ మనం ఒంటరి ప్రాణులం!

నా జీవితంలో నీవు ఒక్కరివే! 
ఏ విషయమూ నీకన్నా ముఖ్యం కాదు 
నాకు ఈ రాత్రి .... నీతో సంతోషంగా గడపడం మినహాయించి 
ఏదీ ముఖ్యం కాదు .... సూర్యోదయం వరకూ 
పిల్లా! నీవూ నేనే ఈ జగతిలో కాలంతో పోరాడుతూ .... ఒంటరిగా,

పిల్లా! దగ్గరగా రా, నా గుండెను స్పర్శించు! 
నా ఊపిరి అనుభూతిని పొంది చూడు!
మానసిక స్వేచ్చ దొరికి, ప్రేమ మార్గదర్శని అవుతుంది. 
ప్రియా! నేను జారినప్పుడు నీచెయ్యి అందించు. 
ప్రతి స్పర్శ, ప్రతి కదలిక లోనూ నిఘూడంగా ఉన్న శక్తి ని పొందుదాం.

అందు కోసం ఒక జీవితకాలాన్ని వృదా కానీయ్యొద్దు! 
ఆ మధురమైన అనుభవం కోసం?
ఆత్మ తో ఆత్మ, కంటి తో  కన్ను కలిపి ఏకాత్మ, ఏకదృష్టి తో 
ఇంద్రధనస్సు రంగులన్నీ ఒక్కటయ్యేలా కలిసి ప్రయాణిద్దాము 
మనమధ్య ఏ విభజన రేఖలూ లేని అంచు వరకూ,

అదిగో అటు చూడు నీటి మీద ఆ చంద్రుడు, 
అలలకు వెన్నెల దారం కట్టి లాగుతున్నాడు .... అది పోటు! 
ప్రేమ అనే మహాసముద్రం లో ప్రేమ .... ఆత్మల్ని పరిశుద్దం 
ప్రక్షాలణ చేస్తుంది. కోరికల సుడిగుండంలో చిక్కుకున్న మనల్ని,
ఈ క్షణం కోసమే నా జీవితమంతా వేచి చూసింది ..... ఈ ప్రేమోదయం కోసమే!

Thursday, July 18, 2013

సహ జీవన మాధుర్యం కోసం



ప్రతి ఒక్కరిలానే నేనూ శోధిస్తున్నా
జీవన ఆనందం కోసం!
నా గురించి చెప్పేందుకు నుతనంగా ఏమీ లేదు.
ఎప్పుడూ మంచివాడ్ని, రాముడ్ని .... అప్పుడప్పుడు రాక్షసుడ్ని, రావణుడ్ని
అదే ప్రేమ విషయానికి వస్తే నేను కేవలం ఒక అవివేకిని.
ప్రేమ కోసం,
నేను పర్వతాలు అధిరోహిస్తాను, సముద్రాలు ఈదుతాను.
నా శోధన
ఏ దేవతా స్త్రీ కోసం కాదు.
నన్నర్ధం చేసుకుని,
నా సాహచర్యం లో సురక్షితంగా ఉండే ....
ఓ నిజమైన నేస్తం, నిజమైన ప్రాణసఖి కోసం.

ఓ పిల్లా! దూరంగా పారిపోవాలనున్నా పారిపోలేవు.
నా మనో సంకల్పం
మన వివాహ మహోత్సవానికై ఉర్రూతలూగుతూ .... నేను.
...............
నేను ఇప్పుడు నా భవిష్యత్తును చూస్తున్నాను.
నా జీవన భాగస్వామిగా నిన్నే చూస్తున్నా!
నేను నీ చెయ్యందుకున్నప్పుడు, నీ ఆనందంలో నా మనోల్లాసాన్నీ,
నీ వణుకుతున్న వేళ్ళ కుదురులేనితనంలో,
నా గుండె ప్రకంపనల్ని ..... చూస్తున్నాను.
నీ అందమైన ముఖాన ఆ మేలి ముసుగును తొలగించి,
నిన్ను ఇంటికి తీసుకొని వెళుతున్నట్లు,
ఈ అడవి, బ్రహ్మచర్యాన్నొదిలేసి, నిజమైన సహచర్యం ప్రేమను పంచి ....
పొందుతున్నట్లు .... నీ ద్వారా సాహచర్య మాధుర్యాన్ని.

కాలం కోలుకోలేని హాని శారీరకంగా చేసిన తర్వాత కూడా,
నీవూ, నేను చేతిలో చెయ్యేసి, నెమ్మదిగా సాయంత్రాలు నడుస్తుండటం,
గువ్వల్లా మన జంట సహజీవనం సాగిస్తుండటం ను
నా కళ్ళ ఊహల్లో చూస్తూ ఉన్నా!
నాకు ఎల్లప్పుడూ నీ వంటే అదే ప్రేమ ఉన్నట్లు,
నేను నీ కళ్ళ లో వెతికినప్పుడు .... ఎప్పటికీ ఆ స్పార్కే చూస్తున్నట్లు,
నీడలు వాలే వరకూ, గదిలో చీకటి జొరబడేవరకూ
నేను ఈ భూమి వదిలాక్కూడా ....
ఏ అప్సరసలు ఎదురొచ్చినా ....
అక్కడ నా నిజమైన సహచరి కోసం వేచి చూస్తూ ఉంటున్నట్లు
ఓ పిల్లా! నా నిజమైన సహచరి కోసం .... నిజమైన నీ కోసం ఎదురుచూస్తున్నట్లు.

ఆమె మనోభావన



వింటూనే ఉన్నా! 
నీవు చెబుతున్న ఆ ఉద్వేగం కబుర్లు 
నీవు అనుకుంటున్నటున్నట్లు,  
నాకు వెర్రి శృంగారం అక్కరలేదు. 
ఆ ఆకాశం చెరాలని, 
ఆ నక్షత్రాలు కోసుకోవాలని,  
ఆ మణులు, 
ఆ మాణిక్యాలు, 
ఆ బంగారం కోరుకోవడం లేదు. 
అవి అవసరాలు అనుకోను! 
ఆనందాలే. 
నేను కోరుకునేది .…
ఒక స్థిరమైన చేతిని. 
దయ, విశ్వాసం 
ఆలోచించగలిగిన ఆత్మను.
నేను, నిశ్చింతగా నిద్రపోయి లేవాలి  
నా అస్తిత్వం సురక్షితం అనే భావనలో.
అలాంటి సాహచర్యాన్ని ప్రేమిస్తాను, 
అలాంటి సాహచర్యం చే ప్రేమింపబడాలనుకుంటున్నాను.


Wednesday, July 17, 2013

సగటుమనిషి



ఎటువంటి
భయం, ఆశ లేవు.
కాగితం మీద పెన్ను, 
జలజలమని 
పారుతున్న ప్రవాహం ....
అక్షర పద 
భావ ఆవేశం మినహా 
........
ఉవ్వెత్తున ఉరకలేస్తున్న 
ఆ చైతన్యం ఆవేశానికి 
ఆనకట్ట వేస్తూ .... పిరికితనం!

విడ్డూరం!



పై నుంచి దొర్లుతున్న
ఆ పొగమంచు
ఇనుప చట్రాల్ని,
టవర్స్ ని పైకి లేపుతూ
ఆ క్రేన్స్
అక్కడే
పర్వతం పై
ఆకుల్లేని ఆ సరుగుడు చెట్టు
నన్ను వెక్కిరిస్తూ,

కవిత్వం


కవిత్వం గా!
జీవితం 
......
కాదు కాదు, 
నా కలలు చిత్రం
నా గుండె మీద మెరుపు ....

ఒంటరి ఇల్లు



నేను 
నీ కోసం వేచి చూస్తున్న
ఒక ఒంటరి ఇల్లు ను.
నీవు మళ్ళీ 
వచ్చేవరకూ
నాలో నివసించేందుకు,
.......
అప్పటి వరకు
ఈ కిటికీలు ఇలా కొట్టుకుంటూనే ఉంటాయి.

అన్యాయం!


ఒక తెలియని అపరిపక్వత
అంధత్వం,
అనారోగ్యం,
మోసపోవటం,
మసకేసిపోవడం,
వాడిపోవడం,
ఆయాసం కారణాలు
నిజం! ప్రేమ .... ది
అసహజ మరణమే ఎప్పుడూ,

విన్నపం!



చేరవస్తావు కదూ!
అకశ్మాత్తుగా నేను ఎప్పుడైనా
ఏడుస్తూ నిద్దుర లేస్తే
ఆ వేళ .... నా కలలో నేను
మార్గాన్ని కోల్పోయిన పసివాడ్ని!
ఏ చీకటి రాత్రుల పొరల్లోనో
నీ ఆత్మీయత కోసం
నీ చాచిన చేతుల కోసం
ఆశగా, ఆబగా
తడుముకుంటున్న అవివేకిని.

Tuesday, July 16, 2013

నేనే నీవు



నాకు, నీవంటే అపరిమిత ఇష్టం 
ఎలాగో, 
ఎందుకో, 
ఎన్ని జన్మల బంధమో .... కానీ,
నిజం! 
ఈ నిజాన్నొప్పుకునేందుకు 
నేను ఎప్పుడూ సిద్ధమే!
నాకు నమ్మకం లాంటి అనుమానం
నాకు తెలిసిన 
ఈ ఇష్టపడటం ప్రేమేమో అని,
నా మనసు లో 
నేనూ నీవూ అనే అస్తిత్వాలు లేని 
విడదీసి చూడలేని 
సాన్నిహిత్యాన్ని ప్రేమ అంటారేమో అని,
నా గుండెలమీద 
నా చెయ్యి నీ చెయ్యి అయ్యి, 
నేను నిద్రలోకి జారి 
నీ కళ్ళు మూతలు పడుతూండటం .....
బహుశ,
నా భావోద్వేగం తప్పకుండా ప్రేమే అయ్యుంటుందేమో అని,

Monday, July 15, 2013

భువనరాగం


కేవలం, 
నీవూ నేనే 
కలిసి పంచుకుంటూ 
ఒక ప్రేమ భాగస్వామ్యం మనది.
ఆనాడే 
తెలుసు నాకు 
మనం 
కలల నిధులు
స్వప్న సౌధాల్ని నిర్మించుకుంటూ
ఒకరికొకరం అవుతాము అని

నాకింకా గుర్తుంది. 
మన ఆ మొదటి ఆలింగనం 
కందిన నీ ముఖం 
కదులాడిన ఆ చిరునవ్వు 
నీవూ నేనూ చేసుకున్న ఆ బాసలు 
ఇప్పుడు 
నీ ప్రేమ నాకు బహుమానం 
నా ప్రేమ 
మరింతగా పరిణతి చెంది 

ఇప్పుడు 
నాకన్నా ఎక్కువగా 
నేను నిన్నే నమ్ముతున్నా 
నీవే నా జీవితం లా 
నా జీవితమే నువ్వు లా 
మనం 
ఒకరికొకరం తప్ప శూన్యం లా 
నా శ్వాస లో నీవు 
నీ మనోభావనల్లో నేనూ 
త్రుళ్ళిపడుతున్న 
మధుర మనోజ్ఞ రాగాలము మనం!

అచేతనత్వం

నా పేరు
నీ పెదవులపై
ఒక మధుర భావం
ఒక ప్రేమ గీతం అయి.
నీ గుసగుసల
మురిపాలు
నా మనోభావనల్ని మేలుకొలిపి ....
నీ స్పర్శ, సాంగత్యం
నన్ను అచేతనుడ్ని చేస్తూ ఉంది.

నీవులేవు

నీవు  
వదిలి వెళ్ళావు. 
ఈ మైదానం 
ఆ ఆకాశం అలా 
శోకిస్తూనే ఉన్నాయి.
ఒక మనస్సు, 
ఒక ఆత్మ 
పూర్తి నిస్పృహతో ....
ఎవరూ 
ప్రత్యామ్నాయం కాలేరు. 
నీ ఉనికిని 
నీ లోటును పూరించలేరు. 
ఓ ప్రియతమా!

Friday, July 12, 2013

శ్వాస ఆడటం లేదు

కారణం నీవే
ఎలా చెప్పాలో తెలియడం లేదు.
పక్కన నువ్వుంటే ....
గాల్లో తేలిపోతున్నట్లుంటుందని,
శ్వాసించలేనట్లుంటుందని
నరాలు, కణాలు ....
శరీరంలోని అణువు అణువు
నా ప్రియ రసజ్ఞ భావనలకు
సంగీతం అమరుస్తున్నట్లు బిజీ అయిపోయి,
నాకు శ్వాసించేందుకు సమయం దొరకడం లేదని.

తెలియడం లేదు.
ఆ అయస్కాంతం చూపుల ఆకర్షణ
నిన్ను ఎలా తప్పుకోవాలో,
ఆ తెల్లని నవ్వు సుమ పరిమళాల ఆకర్షణ,
నా శరీరం, అవయవాలు సహకరించడం లేదు.
వెచ్చని సాయంత్రం ....
ఒక ప్రేమ వరద లో కొట్టుకుపోతున్నట్లు,
నిండా మునిగి శ్వాసించలేకపోతున్నట్లు,
మాటల్లో చెప్పగలుగుతున్నాను.
ప్రాణవాయువు ఆవశ్యకతను,
నీకు మాత్రం .... నీవు లేని ప్రాణవాయువు
నాకు అవసరం లేదని .... చెప్పలేకపోతున్నాను.

Wednesday, July 10, 2013

నా ఎద లోయల్లో ప్రవహిస్తూ


నా ప్రేమ
ఒక వింత భావన
అప్పుడే మసకేసిపోయి అప్పుడే ప్రకాశవంతమౌతూ
ఒక ఆహ్లాదం నా ప్రేమ

నా ప్రేమ
ప్రియురాలు నా పక్కనే ఉండి
మళ్ళీ నూతనంగా ఆమెతోనే ప్రేమలో పడేందుకు సిద్దం గా
తీరని ఆకలి లా, కసి లా, ఆరని ఆవేశం లా .... అర్ధంకాని ఆబ
పిచ్చితనం నా ప్రేమ

నా ప్రేమ
పెదాలు వాడని పదాల మౌన సమ సంభాషణ
ప్రేమే అని నిర్వచించలేని భావన
ఆకర్షణ నా ప్రేమ

నా ప్రేమ
మాటల్లో చెప్పలేని
ఏదో పోగొట్టుకోవాలనుకునే ఆలోచన
విలువలు వెదకలేని స్వత్యాగం
మనోహర బహుమానం నా ప్రేమ

నా ప్రేమ,
ఒక వింతైన వింత సాధన

చౌరాస్తా లో శిలావిగ్రహం


ఒంటరివి 
నిలబడున్నావు 
నాకైనా తెలిసుండాల్సింది

నిన్నా, నేడు, రేపు
నీవు మరుపు 
నేను నటన 

నిన్నటి ప్రపంచంలో, 
నీ ఆలోచనల్లో 
నీవు ఒంటరివి

ఎలా, 
నీవు ఎలా అన్నావో 
నేనొంటరిని కానని 

ఇప్పుడు నీవు 
నాకు దూరం అయ్యావు 
నాడు ఎల్లప్పుడూ నాతోనే అన్నావు

నిన్నటి ప్రపంచంలోనూ 
నీది ఒంటరి ప్రయాణం 
నీ గతిలో

ఒంటరివై నీవు 
నన్నొంటరిగా వొదలనని 
ఎలా అన్నావో ....

Tuesday, July 9, 2013

నాలో లోలో

నా ఎద ఆలోచనలు
నిన్ను కలవాలని .... ఒంటరిగా!
వేల యోజనాలు నడవాల్సిన 
శ్రమ .... దూరం లేదు.
హృదయం గోడమీద అచ్చు లా నీవు!
నీ చిత్తరువు .... నన్నే చూస్తున్నట్లు,
మనోహరమైన భావనలు 
ఆ చిత్తరువు .... పరిమళాలు, 
పరిసరాలు చైతన్య భరితం.
శరీరం వెచ్చదనం చల్లబర్చుతూ, 
సున్నితంగా వీస్తూ 
స్పర్శిస్తున్న పిల్లగాలులు అవి.
సూర్యుడ్ని ఆహ్వానిస్తున్న  
ఈ భూగోళం ఎదురుచూపులు 
ఫలించినట్లు ..... ఓ కొత్త వెలుగు 
నూతన ఉత్సాహం .... నా లో లోలో 
నన్ను ..... చైతన్యపధం వైపు నడిపిస్తూ.

Monday, July 8, 2013

మనోభావన


కళ్ళు చెదిరే అందం ఆమె
అది
ఒక ప్రియ భావన
ఉపక్రమించిన
ప్రతి పని
శ్రద్ధ, అలవాటు ఆమె లో
ఆమె ముఖంలో
ఓ వింత కళ .... అయస్కాంతంలా,
ఈ ప్రపంచంలోనే
అద్భుత సౌందర్యరాసి .... నా కళ్ళకు ఆమె,
నేనున్నా అని ....
భరోసా ఇస్తున్నట్లు.
ఆ చిరునవ్వు,
ఒక దేవతా పుష్ఫ పరిమళం!
ఆ పరిమళం,
ఆమె ప్రేమ కోసం
ప్రాణాలు
పణంగా పెట్టాలనిపించే
ప్రత్యేక ఆకర్షణ ఆమె.
అందుకే,
నా కలలు,
ఆశలు ఊహల ఇటుకల్తో ....
ఒక ప్రేమ పునాది కట్టుకుంటున్నా!
ఆమె ప్రేమ కోసం,
ఒక ప్రేమ మందిరం నిర్మాణం కోసం.
ఆమె
నన్ను ప్రేమించాల్సిన
అవసరాన్ని ఆపేక్షించలేను.
నా మనోభావనను వ్యక్తీకరించగలను తప్ప!

స్వప్నం!

నీవు, నన్ను
ఒక స్వాప్నికుడు అంటున్నావు.
నేను మాత్రమే కాదు.
నీవు కూడా
అది నా ఆకాంక్ష ఆశ.
ఆ రోజు రావాలని ....
మానవాళి అంతా
ఒక ఫామిలీ లా ఉండాలని.

అందం

అసంపూర్ణతలోనూ ఉంది.
అందం!
ఒక మేధావి పిచ్చితనం లోనూ,
విచిత్రవేషధారణలోనూ,
అది కల అయితే ....
ఆ కదలికల్లో,

పయనం

పిల్లా!
నీతో వుంటే
ప్రియం .... అంతా
చావైనా ....
నీవు లేని జీవితం ....
కష్టం పయనించడం!

పగిలి హృదయం


పగిలిన
హృదయం అద్దం .... లో
ముక్కలై నీ రూపం ....
నా గుండె
కొట్టుకోవడం మానేసింది!

Sunday, July 7, 2013

అమరం

ఆనందం,
బాధ, చెడు .... కావు
ముగింపు లేనిది.
అమరం
నిజమైన ప్రేమ!

ఎందరో


కొందరికి
భోగం!
ఎందరికో
భావోద్వేగం, అనుభవం ....
ప్రేమ!

ఒకరికొకరు

ఒకేచోట
ఉండటం కాదు
ఎప్పుడైనా, ఎక్కడైనా
ఒకరి కోసం ఒకరు
ప్రేమ!

నీవు కావాలి

పండ్లు,
పూలు,
ఆకులు, కొమ్మలు,
ఆ పక్కనే,
నీ కోసం కొట్టుకుంటూ ....
నా హృదయం!

నిశ్శబ్దం!

కొన్ని
వేల వోల్ట్ ల
విధ్యుత్ ఘాతం
తగిలినట్లు
ఆ చందమామ
మసకేసిపోయింది.

భూమి మీదకు
తారలు
దిగివస్తున్నాయి.
స్నేహపూర్వకంగా
ఆసూర్యుడ్ని పరామర్శిద్దామని
చిక్కటి చీకటి రాత్రుల్లో
ఉత్సాహం
ఉరకలేసే చైతన్యం
గుర్తింపు దొరకడం లేదని

వాసన కన్నా
అనుభవం ముఖ్యమై
ఆ చిరునవ్వు 
ఆ పుష్పించిన వసంతం ...
పూల పరిమళం
రా! ఇప్పుడు స్పర్శించు
నా ఒంటరితనాన్ని .....
ఈ నిశ్శబ్దాన్ని బ్రద్దలు చెయ్యి!

నా చిన్ని ఆకాంక్ష

గగనం లో
ప్రకాశవంతంగా మెరుస్తూ
నక్షత్రాలు,
నేను
నిన్ను ప్రేమిస్తున్నా
అంటూ
రాత్రి గాలుల
గుసగుసలు
పెరట్లో
తోటంతా కలియతిరుగుతూ
ఆ సీతాకోకచిలుకలు
నా తలపుల్లో
చిగురించిన
ఓ చిన్ని కలలో

అలసట తో
విశ్రమించే ముందు
ఓ ముద్దు ఇవ్వు
గట్టిగా హత్తుకుని
నిన్నెంతో
మిస్ అవుతున్నా
అని
సున్నితంగా స్పర్శించు!
నా
ఒంటరి క్షణాల్లో
నేను
సిగ్గు మొగ్గనయ్యే భావనలు
అభిమానం
దారానికి వ్రేలాడుతూ
ఓ చిన్న కల కను

ఆకాశంలో
మసకేసిపోతూ
ఆ తారలు
నేను మాత్రం
మెరుస్తూ
నీ ముద్దు
జ్ఞాపకం ను
తలచుకుంటున్నా!
ఈ రేయి
ఇక తెల్లవారరాదని
కోరుకుంటూ,
ఓ ప్రియా
ఈ విధంగా
చెబుతున్నా వేడుకుంటున్నా!

సూర్యుడు
కిరణాలు
వెచ్చదనం
తగిలే వరకు
తియ్యని కలలు కనాలని,

కలల తోటలో
అన్ని ఆందోళనలను
వదిలివేయాలని,
నా
భావనల పర్యవసానం
ఎలా ఉన్నా ....
నా కల
నీ కల కావాలని
నా గురించి
నీవు
ఒక చిన్న కల కనాలని,


Saturday, July 6, 2013

మేధస్సు

నీ
మేధస్సు ను ....
కుదిస్తుంది 
ఒక కంప్యూటర్
అవమానిస్తుంది
ఒక టీవీ

సిటీ బస్సు!

విసిగిస్తుంది
పరుగెత్తించి మరీ ఎక్కనిస్తుంది
నగర వాహనం
నీవు
ప్రయాణిస్తున్నప్పుడు కంటే
అందుకోవాలనుకున్నప్పుడు
వేగంగా పరుగులుతీస్తూ

అం....తరంగాలు


తక్కువ
ఆలోచించడం
ఎక్కువగా
మాట్లాడటం ....
మనిషి నైజం!

ముసలితనం రాదు
ఎప్పుడూ
అందం,
ఆనందం
చూసే సామర్థ్యం ....
మనసుకు ఉంటే!

పాతబడుతూ
మనిషి
మౌన బాష్యాలు
వినడం,
మాట్లాడటం!

భావ వీచికలు


ఎన్నడూ
నమ్మలేము
ఈ ప్రాపంచిక భావోద్వేగాలు
కృతజ్ఞత, ప్రేమ!

హింస
అసూయ కంటే
బలమైనది.
ప్రేమ!

వర్తమానం పై విశ్వాసం
ఒక్కో రోజు
ఒక్కో కొత్త రంగు,
ఆశ,
గమ్యం!

Friday, July 5, 2013

తచ్చాట


మెదడూ, హృదయము
ప్రశంస పొందేందుకు
పొందే చోటే తచ్చాడుతాయి .... ఆశగా!

ప్రయత్నం


రోజూ వో కొత్త అవకాశం
లేచి నిలబడడానికి,
నిలబడ్డానికీ, ఓ కొత్త ప్రయత్నానికీ!

జీవితం


ఎవ్వరూ ప్రేమించని జీవితం
ఎంతో భయానకం
భయంకరం .... పేదరికం, ఒంటరితనం!

Thursday, July 4, 2013

అంతరంగం

నా వ్రాత, నా శ్వాస
కట్టుబాట్ల తాళ్ళు వొరుచుకుపోయిన
గాయం .... పుండు, బాధ
అక్షరాల రోధన
నా పదాలు
పాటలు జానపదాన్ని చేరలేన్నాడు,
ఎందుకు రాయాలి?
ఈ సంస్కృతి కి ఏ ఉపయోగం ఉందని రాయను!?

తొలిప్రేమ


హాయ్, అన్నాడతను పలుకరింపుగా,
నేను,
ఈ తలపుల తలుపులు తీసింది
నేను లోపలికి వెళ్ళేందుకు.
ఒంటరిగా.
తొలిగా నాకు నీవు కనపడలేదు.
ఇప్పుడు,
నీకు నేను కనపడనని తెలుసు.
ఎవరికీ నేను కనపడను.
కానీ నీవు నాతో రావొచ్చు!
ఆవల ఏముందో ఎలా ఉంటుందో నాకూ తెలియదు.
ఒక్కటి మాత్రం నిజం
నా వెనుకే నీవు రావడం నాకు ఇష్టం అని.
నిన్ను కలిసిన క్షణం నుంచి
నా ఆకాంక్ష అదే. .... అన్నాడు అతను.

నేను .... నీతో వస్తున్నా!
నీతో కలిసి నడవాలనుంది. అంది ఆమె.

వివేకం



తారలు
నక్షత్రాలు
సరసన ఉండాలనుకోవడము 
ప్రతిష్టాత్మకత.
ఆశ్రిత హృదయాల
దరి
చేరాలనుకోవడము
తెలివైన కోరిక

Wednesday, July 3, 2013

బహుమానం


ముద్దులు
ముచ్చట్లు, మురిపాలు
లాంగ్ డ్రైవ్ లు బహుమానం గా .... కాదు.
సంరక్షణ,
ఇచ్చి పుచ్చుకోవడం
భాగస్వామ్యం బహుమానం .... ప్రేమ

కావ్యం ....

జ్ఞాపకాల 
గతం
ఈ కావ్యం ....
ఒక
సంపూర్ణ పద
నదీ ప్రవహం!

వింత లోకం



పక్కటెముకల గోడనానుకుని
ఎద భావన ....
దారాలు పట్టుకుని
వ్రేలాడుతూ
మరిచిపోయిన ఒకనాటి గతం
జ్ఞాపకాల నీడలు
ఈ నిశ్శబ్దాన్ని చీల్చుతూ
లయబద్దంగా
పాత గడియారం లా కొట్టుకుంటూ
ఓ వింత అనుభూతి

Tuesday, July 2, 2013

అల


సున్నితము
కనిపించీ కనిపించని నిజ సౌందర్యము
అందం
మెరుపు ఆమె
అప్రయత్నం గానే ఊపిరి భారమై
నా గుండెలో అలజడి
సాధ్యమైనంత చేరువ కావాలని.

ప్రకృతి రాగం!


పక్షులు పిలుస్తున్నాయి.
ఉడుములు పాకులాడుతున్నాయి.
తోకలు ఎగతాళిగా ఊపుతున్నాయి.

ఇది వసంతమే
తిమింగిలములు చెలరేగుతున్నాయి.
పురుగుల గుంజుకొంటూ తోకలు ఊపుతున్నాయి.

ఈ పాట ఎవరు రాసారు?
నేను పాడేందుకు వీలుగా
అందరికీ పూనకం వచ్చేలా పాడాలనుంది.

ఒక వింత భావన హృదయం లో
వసంతంలోనే ఎందుకిలా .... ఒళ్ళెందుకు ఝలదరిస్తుందో ....
ఓహ్, ఇది ప్రేమే, అంతా ప్రియ భావనే!

నిజం!



లోతైన వాస్తవం
ఎంతో ఘాడం .... నా ప్రేమ,
నీవు ఏమి చేస్తున్నా
నా మనసు
నా ఆలోచనలు
నేను నీతోనే ఎల్లప్పుడూ

స్వర్గమైనా,
నరకమైనా
నీ నీడలానే
నీ పక్కన ఉంటాను.
నేను చనిపోయే రోజు వరకు,
నా ప్రేమ నిజం ఎప్పుడూ నీ విషయంలో ....

Monday, July 1, 2013

నా బాధ్యత ఎంతవరకు?



బీటలు పడి
పొలం .... కమ్మని ద్వని
ఆ కురుస్తున్న వర్షం ఒకవైపు.

కొండలు విరిగి
చెల్లా చెదురై సమాజం
ఏడుపులు .... నీడలు మరోవైపు.

ఒంటరిగా
నాతో నేను
చెప్పుకుంటున్నా!

ప్రచార మాధ్యమం
ద్వారా
చోద్యం చూస్తున్నా!

సామాజిక జీవిని .... కానీ,
వెలుపలి వర్షం తడి బట్టల చల్లదనం
నా వెన్నులో సలపడం లేదు.

అందుకేనేమో,
చందా లు .... బాధ్యత గా,
నాకు, నా ఇల్లే స్వర్గం అన్నట్లు!


శరణార్ధిని


నీవు
నా స్పందన,
నా మనోభావన,
నిత్య
చైతన్యం
ప్రేరణ.

నా
అన్ని
క్షణాలు
కలలు, కదలికలు
కాలుతున్న
కోరిక లు
లో నీవు

నా
ఒంటరితనం
నిశ్శబ్దం
చీకటి రాత్రుల
అసంతృప్తి
కోరిక నీవు.

నీవు
నా జీవితం
ఎడారిలో,
పూచిన
ఒక ఆశ్రయం
అలజడి తుఫాను.

నీవు
నా ప్రకృతి.
నా గుండె
శ్వాస 
....
నీవు లేని,
నేను లేను.