ఆత్మహత్య చేసుకోవాలని మనసు ఊగిసలాడుతుంది.
బందువుల్నీ, స్నేహితుల్నీ, ఈ సమాజాన్నీ .... పక్కన పెట్టి,
సామాజిక జీవనానికి, ఈ లోకానికి .... వీడ్కోలు చెబుతున్నా!
కేవలం ఒక అమ్మాయి కోసం ఇలా .... అర్ధాంతరంగా నా .... అనుకోకు!
ప్రేమ ముగింపు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది! అంతా.... విధి రాతే!!
నాకు ఆలశ్యంగా ప్రేమించాకే .... జ్ఞానొదయం అయ్యింది.
ప్రేమను పొందడం అంత సులభం కాదు, నిరర్థక సామెత కాదు జీవితం అని!
నా ప్రతిమాట వెనుకా బలమైన కారణం ఉంది. ఉద్రేకం మాత్రమే కాదు.
నేను ప్రేమించింది నిజం! నాది కాదు ఆమె అనేది నిజం అని తెలిసాక,
నేనేం చెయ్యగలను ఇంతకన్నా .... ఈ పని చెయ్యని వెన్నెముక .... పగిలిన గుండె....తో,
This comment has been removed by the author.
ReplyDelete"ప్రేమించటం అంటే, తిరిగే అవతలి వాళ్ళు అలానే స్పందించాలనుకోవటం కాదు. ఆమె కాదన్నా, అవునన్నా జీవితాంతం వాళ్ళ మంచి కోరుకోవటం. వాళ్ళకి ఏ వయసులో ఏ కష్టం, సుఖం పంచుకోవటానికి ఒక మనిషి ఉండటం. ఇప్పుడు ఆమె రాలేకపోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు , ఆమెకి అందరూ ఉన్నా, వేరొకరి మీ అవసరం రావచ్చు, అప్పటికి మీరే లేకపోతే ఎలాగా అని ఆలోచించారా?" .... స్పందన లో ఆశావహ విశ్లేషణ ఉపశమన వాఖ్య
Deleteఐ సి యు లో పడిఉన్న ఒక మనిషి ని అందుకు కారణం అడిగి తెలుసుకున్నాక దానికి అక్షరా రూపం యివ్వడం జరిగింది. సమాజానికి మీలాంటి ధైర్యం చెప్పే వ్యక్తుల అవసరం ఎంతో ఉంది. నేనూ అదే చేసాను.
ధన్యవాదాలు మానస గారు మీ మంచి మనసు మంచి ఆలోచనకు!