ప్రకృతిచే విసర్జించబడి
నేనిక్కడ మాసిపోయి మెలుకువలో
నన్ను నేను ప్రశ్నించుకుంటూ ....
మరెంతకాలం ఇలా అని
సాధారణ మనిషిగా మారేదని
ఎంత సేపని .... నొప్పితో జీవించేదని
నీవెందుకు నాపై .... ప్రేమ వర్షమై కురువవు అని,
మొదటి సారి .... నిన్ను చూసినప్పుడు,
భూమ్యాకర్షణ శక్తి నన్ను పట్టుకోలేక
అంతకు మించిన ఆకర్షణ లా
జీవన సంతులనానివి లా కనిపించావు.
పెదవి విప్పి .... ఒక్క మాటైనా మాట్లాడకుండానే,
అందంగా విప్పారిన కళ్ళు .... రెపరెప లాడుతూ
గుసగుసలు అద్భుతాలు ఎన్నో .... నీ గురించే,
రోజువారీ విషయాలు తలలో .... నీతో పంచుకోలేక, చెప్పుకోలేక
నీకు నా ప్రేమపై నమ్మకం లేదని తెలిసి
నన్ను నేనుగా వేసుకునే ప్రశ్నలు .... ఎన్నో
ఎన్నాళ్ళీ బాధాకరమైన ఈ ఒంటరి స్థితి అని,
ఆ రోజు నీవు ఇచ్చిన షాక్ రియాక్షన్
నేను "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నప్పుడు
ఆ చూపుల నిర్లిప్తభావాలు మరువ లేను.
కానీ నీ ప్రేమలోనే ఉన్నాను .... మార్చలేక నన్ను నేను.
నేను నీ ముఖం లోకి చూస్తున్న ప్రతిసారీ .... ఎందుకో,
నా గుండె వేగంగా మరింత వేగవంతంగా కొట్టుకుంటూ
లెక్కించలేనంత వేగంగా శబ్దం .... శ్వాస వేగంగా
నీతో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు
నాకు నేను వేరే లోకంలో ఉన్నట్లు,
అక్కడ, ఎలాంటి సంకోచాలు దాపరికాలు లేనట్లు,
కానీ ....
నాకు తెలుసు ఆ భావనల్ని .... నా కలల్ని
మినహాయిస్తే .... అంతా కృత్రిమము, నకిలీయే అని.
సమాధానం తెలిసీ తెలియనట్లు ఇలాంటివే
నా తలలో .... ఎన్నో ప్రశ్నలు!? కదులుతూ, పరుగులు తీస్తూ,
నాకు నేను విసర్జించబడి .... తల వాల్చినప్పుడు,
పిచ్చి ఆలోచనలు, పీడ కలలు
కళ్ళను కప్పేసిన .... గుండె స్పందనలు
నన్ను గానీ నీవు ప్రేమించ లేకపోతే
దూరంగా వెళ్ళిపో అని, నీతో చెప్పలేక చెప్పాలని
మరణించినా ఫర్లేదు వదిలెళ్ళు .... నా గుండెను అని.
No comments:
Post a Comment