ఓ బాల్య స్నేహం, ప్రేమై .... పల్లవించి,
జీవన బాగస్వామి అయ్యి,
విడివిడిగా జీవించాల్సిన పరిస్థితులు అవి.
పక్కరాష్ట్రంలో ఆమె
ఇక్కడ ఉన్న రాష్ట్రంలో నేను
నన్ను నేను చంపుకుంటున్నాను!
సౌలభ్యం పొందలేక పోతున్నాను.
ఏ వ్యక్తి సాన్నిహిత్యం అనురాగంలోనూ,
నా కోరిక .... నా మనోల్లాసం
నా చెలి చెంతనే అని .... ఎవరైనా చెప్పాలని
ఆమె, నా పక్కనున్నప్పుడే స్థిమితంగా ఉంటానని,
ఆమెనే చూస్తూ కాలం గడపడంలోనే అని,
ఆమె నా చెంతే ఉంటుందని
నన్నొదిలి వెళ్ళలేకే ఆమె అప్పుడప్పుడు వొస్తుందని
ఆమె నన్ను చూడటానికి వచ్చిన ప్రతిసారి ....
ఆమె కళ్ళు లోకి తదేకంగా చూస్తూ,
నన్ను నేను మర్చిపోవొచ్చని ....
ఎవరో నాకు చెప్పాలని,
కానీ .... వీడ్కోలు చెప్పక తప్పదు.
మళ్ళీ నేను ఒంటరిగా ఉండక తప్పదు
ఉండాలనుకోకపోయినా ....
అందుకే .... ఎప్పుడైనా,
కన్నీరు చురకత్తుల్లా నా ముఖంపై జారి
చురుక్కుమన్నప్పుడు
ఆమె వెళ్ళిపోయింది అని ఆనవాయితీగా.
నా కోరిక, నా అవసరం, నా ఇష్టం
ఆమె నాతోనే ఉండాలని.
ఆమెను నేను ఎప్పుడూ కొల్పోరాదని.
కావాలనుకున్నప్పుడు చూడాలని.
మళ్ళీ మళ్ళీ ఆమెను చుట్టుకొని,
ఆమె చేతిని పట్టుకుని .... ఎన్నో చెప్పాలని.
ఎప్పుడూ ఆమె కళ్ళల్లో నవ్వును చూడాలని.
ఆమెను
నా ప్రేమను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను.
ఆమె కోసం వేచి ఉండగలను ఎన్నాళ్ళైనా.
కేవలం కోరిక
నా ఆశ ఆవేదన మాత్రం,
కాలం మరింత వేగంగా కదలొచ్చుగా అనే.
No comments:
Post a Comment