Saturday, January 12, 2013

యాంత్రిక జీవనం


ఒకేలా ఆలోచించే
నీవూ, నేనూ కలుస్తామని
ఆలోచనల భారం అధికమై ...
అప్పుడప్పుడూ
కాసింత విశ్రమించాల్సొస్తే 
ఒకరికి ఒకరు
తోడు అవసరమని
మనం ఒకటవ్వాలని 
కానీ,
మనం ఎప్పుడూ
ఒకరి నొకరం
అర్ధం చేసుకునే
ప్రయత్నం చెయ్యలేదు.
ఓపిక నశించి
నిర్వీర్యం అయ్యే క్షణాల వరకూ
ఆశలు కన్నీళ్ళై కారేవరకూ

నా గుండె
మండుతుంది
రగులుతుంది
నాలాగే ఆలోచించే
నిన్ను
నీ ఆవేశంలో
కొట్టుకుపోతూ చూసాక
ఇన్నాళ్ళూ ఎందుకు
గమనించలేదూ అని 
నీ విశిష్ట మనస్తత్వాన్ని
నా మనో ఆశయాన్నీ
ఇప్పుడు
నా ప్రేమను
నేనే నమ్మలేకపోతున్నా ....
నిజమా అని.

అడవులు,
కొండల్లో కురిసిన
వర్షం ప్రవాహమై
మానవత్వాన్నే తడుపుతున్నట్లు
మబ్బులు
ఆకాశంలో పరుగులు తీస్తూ
మనిషి మనసుతో
పలుకరిస్తూ పోటీ పడుతున్నట్లు
నిన్ను గమనించిన .... నాలో
ఈ చిరునవ్వుకు
అర్ధం వెదకకు 
మనం కలిసి కూర్చుందాం!
పక్కపక్కన,
ఎత్తైన ప్రదేశంలో .....
ఒకే దిశగా చూద్దాం!
కలిసి కలలు కందాం ....
మరిచిపోవొద్దు ప్రియా!
లక్ష్య సాధనకు తొందర తప్పదని.

No comments:

Post a Comment