Saturday, April 5, 2014

నిజం చెప్పవా .... పిల్లా!




 











ఒక్కసారైనా
గుసగుసలు ఆడు .... చాలు
ఎద లో ఉన్నది నేనే అని
ఎదను, ఎప్పటికీ
బహుమానంగా ఇచ్చేసానని

నీడనై .... నీ పక్కన ఉంటే
మక్కువని
ప్రేమిస్తూ ఉంటానని
వీలున్నన్ని విధాలుగా
రహశ్యాలు చెప్పాలనుందని

కాలంతో పాటు కదిలిరాని
మారని, మార్చుకోలేని
మనసుమాటలు
నేను నీ నీవాడిని అనే
నిజం .... వినాలని ఉందని

నీ కోరిక, నీ ఆశ, నీ గమ్యం
నీ నీడ
నీడకు కారణం చత్రం
నేనేననుకున్నావని
నీ తోడును నేనని అనుకున్నావని

చెప్పక తప్పడం లేదు.
నీ సాన్నిహిత్యాన్ని మించిన ఆనందం
నీ ప్రేమను మించిన ప్రేమ
నేనెరుగనని ..... అందుకే
బ్రతికున్నన్నాళ్ళూ తోడును నీడనని




నా ఆనందం, నా మనోగతం
నా జీవన సాఫల్యం .... నన్ను నేను
సమర్పించుకున్నానని .... నీకూ తెలుసు
నా ప్రేమ తపోదనాన్ని
నా హృదయాన్నీ, నా ఆత్మను

నిన్ను, నాతో, నాలోనే
జాగ్రత్తగా పొదువుకుంటానని తెలుసా
గాలి కూడా చొరలేనంత గా
విడదీయలేనంత
సాన్నిహిత్యంగా నీవెంటే ఉంటానని.

జన్మజన్మల బంధం కావాలని కోరుకుంటాను
నా బాహువుల్లో
గువ్వలా .... నువ్విమిడిపోయిన భావనను
ప్రేమై నీవు
నన్నల్లుకుపోవాలనే ఆశ ఒక వరమవ్వాలని

ఆలోచించేకొద్దీ అవగతమౌతుంది.
నిజంగా
స్వచ్చందంగా, నిర్మలంగా
నన్ను నేను సమర్పించుకుని
పరిపూర్ణంగా నిన్ను ప్రేమిస్తున్నానని.

పిల్లా! తలనుంచి గోటి వరకూ
తలమునకలై కొట్టుకుంటూ ఉన్నాను
నాకు నీ సాంగత్యం కావాలని
మాయ లేని నీ ప్రేమ కావాలని
ఇరు హృదయాత్మల సంగమం కావాలని.

Friday, April 4, 2014

కోల్పోయానన్నదే నిజం






 








హృదయం
ఆత్మ చుట్టూ
ప్రదక్షిణలు
చేస్తూ ఉంది.
తెలియని చీకటిలో
నిండుగా
కూరుకుపోయి
కోల్పోయిన భవిష్యత్తును
శోధించడం లోనే
నిమగ్నమై ....

నిరాశ .... కాంతి లా
జ్ఞాపకాలు
వివిధ రూపాల్లో
విస్తరించి
సవారీ చేస్తూ ....
ఎందరితో పాటు
ఎరిగిన
ఏ అదృశ్య హస్తమో
కోరికలు
బలహీనతలను
ఎరిగి ....
కవ్వించి ఊరిస్తూ

దగ్గరలోనే ఉండి,
పట్టించుకోకుండా
కనీసం
చిరునవ్వైనా పూయకుండా
పరిసరాల్లో
కదులుతూ .... విరహం
మనసును పిండేసిన
తియ్యని బాధ
ఆత్మ క్షోభ
ప్రాణం పోతూ,
నిశ్శబ్దం .... మధ్యలో
దోబూచులాడుతూ

ఒకరితో ఒకరు
కలిసి
పెంచుకుని పంచుకున్న
ప్రేమ,
కాలగతిచెంది
లోతు తెలియని
అంతులేని
సమశ్యల సాగరంలో
మునిగి ....
ఊపిరిని కోల్పోయి
తేలుతూ
సచేతనత్వం, నిర్మలత్వం
ఇంద్రధనస్సు రంగులు
కోల్పోయి




ఖచ్చితత్వం
కాని నిజం
ఒకటున్నట్లు
తెలుస్తూ
శోధించడం లోనే
హృదయం
అమూల్యమైన సమయం
వృధా చేసుకుంటూ
ఆత్మ, హృదయం
కోల్పోవడం మాత్రమే
నిజం అని తెలిసి
ఆరాటం పెరిగి
అనర్ధమని అనిపించి 

Sunday, March 30, 2014

చెదలు




 









తుప్పు యినుమును తినివేసినట్లు ....
జీవన విలువలు హరించుకుపోతూ
దినదినమూ
క్షీణత దిశగా భూగోళం
వాస్తవదృష్టితో చూస్తే
ప్రాకృతిక అసంతులనం .... జీవనం




అగ్ర దేశాల్లా ....
కొందరు రాజకీయ నాయకులు
తయారుచేసిన ఆయుధాలు మూకుమ్మడి వాగ్దానాలు
అమ్ముకుని
మరింత అగ్రగాములయ్యే ఆశ ....
బీద దేశాల్లాంటి
సామాన్యుడిని ప్రలోభ పెట్టి .... ప్రయోగిస్తూ




కడుపు మాడుతున్నా,
పునరావృతమౌతున్న ప్రలోబాలకు లోబడి ....
సాద్యం కాని శ్రమపడకుండా ఎదగాలనే ఆశతో
విలువలు సర్వస్వం కోల్పోతూ .... సామాన్యుడు
అగ్రజుడు అగ్రజుడే అని
ఏ పార్టీలో ఉన్నా నాయకుడు నాయకుడే అని
తెలుసుకోలేకపోతూ

అణువణువులో సత్తువనంతా కూడగట్టుకుని
సర్వస్వం కోల్పోయేవరకూ
పోరాడాల్సిన తరుణం లో
సొమరై, సామూహిక అజ్ఞానం తో
బ్రతుకుభారమౌతూ ....
తుప్పు యినుమును తినేసినట్లు .... ఏమి ఆశించో
కొందరు నాయకులు చీమల పుట్ట చెదలును కదిలిస్తూ

పడి చచ్చైనా




 














మిణుగురు కాంతిలో ....
నీ, మృదు
మంజుల సౌకుమార్యం 
మనోజ్ఞతను చూసాను.
జీవించగలను.
నీ కోసం
పణంగా పెట్టాల్సొచ్చినా .... ప్రాణం

నా చెలి!




దూరంగా ఎక్కడికో నీవు వెళ్ళిపోతూ
తలుపులు మూసివేస్తున్న భావనే
కన్నీళ్ళై, నా బుగ్గలపై జారి
నా ప్రపంచం .... శూన్యం అయిపోతున్నట్లుంటుంది
నా భుజస్కందాలే నాకు దూరమై ....
నా మనోగతం చీకటి అయోమయమై
కాలం భారంగా కదులుతున్నట్లు
గోడమీద గడియారమూ, గుండె లయను కోల్పోయి 
అసంతులనంగా వేగంగా కొట్టుకుంటున్నట్లుంటుంది.

నీవు పక్కనున్నప్పటి
నీ స్నేహ ఆత్మీయ బుజ్జగింపులు
నా మది తెరపై జ్ఞాపకాలై
అస్పష్టంగా .... పదే పదే కదులుతూ
నీ ప్రతి ఊహ తోనూ నా హృదయం ఆవిరై
ఒంటరితనం పై .... తీవ్రమైన అసహ్యం పెరుగుతూ
తెలియని అలజడి, నా నరనరాల్లో పెరిగి
ముచ్చెమటలు పడుతుంటాయి.
గదిలోని ప్రతి వస్తువు మౌనంగా
నీ పేరే జపిస్తూ నా మనసును కలవరపెడుతుంటుంది.




తీయని సెంట్ వాసన .... ఏదో
బెడ్ రూం లో వరదలై పారి
తలగడను అతుక్కునున్న సువాసనల జాడలు
బెడ్ రూం నేలపై పరుచుకునున్న
నీవు విడిచిన
ఆ దుస్తులు వెదజల్లుతున్న
నీ స్వేద మత్తు వాసనలు
పీల్చేకొద్దీ .... విపరీత భావనలేవో చెలరేగి 
నా గుండె అల్లల్లాడుతుంది.

అకస్మాత్తుగా
నా మనస్సు ఖాళీ అయిపోయి
నేను అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నట్లు
నా సర్వమై అమూల్యమైన లక్షణం
నిన్ను శాశ్వతంగా కోల్పోతున్నానన్న కారణం ఏదో
నన్ను ప్రశ్నిస్తుంటుంది.
నిజానికి .... నీవు నానుంచి కోరుకున్నదేమిటని?
నా ఆత్మ సమర్పణ
నీన్నే ప్రేమిస్తున్నాననే ఆలోచనను
దాచలేని నా ఎద భావనను .... నా నోట వినాలనే అని.

నీ ఆత్మ సౌందర్యం ప్రకాశమేమో
నీ కళ్ళలోనే కనిపిస్తుంది
నీ పెదవుల్నుంచి త్రుళ్ళిపడే .... తియ్యని మాటలు
మదిని ఊరిస్తూ
స్వర్గం
ఎంతో సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది.
నీవు నా పక్కన ఉన్నప్పుడు
నీ నవ్వు
నా ప్రపంచాన్ని ఆశావహం గా మారుస్తూ, 




జంట నక్ష త్రాల్లా
ఏ వజ్రాలూ కెంపులకు లేని మెరుపుల్లా
లక్షల్లో అరుదైన ఒకే ఒక్క జంటలా
మన ప్రేమ మనకు అరుదైన ఆనందాన్నిస్తూ
ఏ ప్రత్యామ్నాయమూ లేని
దివినుంచి దిగివచ్చి .... భువిలో
నా కోసమే జన్మించిన మణివో మాణిక్యానివో అన్నట్లు
ఎన్ని జన్మలైనా ఎంత మదనపడైనా
పొందాల్సిన సందర్శనీయ బహుమానం
నీ అనురాగం అనిపిస్తుంది.

నా హృదయం నీకు సమర్పించుకుంటున్నాను
నీపై నాకున్న ప్రేమకి గౌరవ సూచన గా
సంపూర్ణంగా ....
అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది
ఆ బ్రహ్మ
ఎంతో కష్ట పడి
అనురాగము, ప్రేమ .... సమతుల్యం గా
శిల్పంగా నిన్ను చెక్కాడేమో అని
నా అంతరాంతరాల్లో
తుడిచివెయ్యలేని రాగ బంధం నీ ప్రేమే అని

అంకితమిస్తున్నాను. నా  అమరప్రేమను .... ఎంతో వినమ్రంగా
నీవూ, నేనూ ఒకరికి ఒకరం చేరువైన క్షణాల్లో
తగిలే నీ వెచ్చని శ్వాస కోసం ....
నీ అనురాగం స్నేహం ఆత్మీయతల కోసం ....
శారీరకంగా, మానసికంగా నన్ను
నీకు సమర్పించుకుంటున్నాను.
నీ ప్రతి కోరిక నా ఆత్మ అభీష్టమే అనుకుని
జీవన చరమ ఘట్టం ....
స్వర్గం చేరేవరకూ .... కలిసుంటానని
మాటిస్తున్నాను.
నా ఆత్మ, నీ ఆత్మ ప్రేమకు కట్టుబడి ఉంటుందని

Saturday, March 29, 2014

రాయలేను, నా నమ్మకాల్ని .... స్వచ్చందంగా




మళ్ళీ భావుకుడ్నై .... నేను
భావనలను విస్తరించలేను
రాయాలని ఉపక్రమించినా ....
నాగరికత తెలియని
ఆటవిక రోజుల ఔన్నత్యాన్నీ
ఆది మానవుడ్ని ....
ఆ పిదప
స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల
జీవన సరళిని
పరిచయం చెయ్యాలని చూస్తే 
అన్నీ ఇబ్బందులే
అన్నీ అపశృతులే




శిధిలమైన
నాటి గురుకుల పాటశాలలు
చెట్లక్రింద బోధనలు
గోడకుర్చీలు, తొడపాశాలు
పేనుబెత్తం అరచేతి వాపుల .... గతం
ఆ భావనలను రాయలేక ....
ఒప్పించలేక
ఏ బోదివృక్షం ముందో దోషి లా నిలబడి
వెర్రి చూపులు చూడాల్సిరావడం
ప్రేమ, స్వచ్చత, పరిపూర్ణతలను నిర్వచించే క్రమం లో
ఆ నాటి భావనలు, నేటి నిర్వచనాల మధ్య
సామీప్యంలేని అంతరాలను
ఒక్కటి చెయ్యలేని అవ్యక్తతో కూడిన బాధ
మళ్ళీ భావుకుడ్నెందుకయ్యాను
భంగపడేందుకా?
అనే ప్రశ్న, సంశయం
మదిని తొలచడం ఇష్టం లేక, రాయలేను ....

Friday, March 28, 2014

సవరించబడి ....!



 









నిజం గా
ఎంత సౌకర్యమో
కనుగొనగలగడం
ఇద్దరు ఒక్కరై
రాసుకున్న
అక్షర పద అవయవాల
కథలో
పాత్రల రూపాలు మనం
ఏ క్షణాన్నైనా
తిరిగి రాయబడతాము అని

ఒంటరి నిశ్శబ్దమా .... కుశలమా?



 

















కిటికీలోంచి
గుడ్డి దీపపు కాంతి
వెలుపల
చిక్కగా పరుచుకునున్న గుబులు చీకటిని
పారద్రోలాలని ప్రయత్నిస్తూ
మరింత అంధకారమై అలుముకుపోతూ
అంతా నిశ్శబ్దం
ప్రపంచం విశ్రమిస్తూ
ఆరిన పొయ్యిలో నిద్రపోతూ
ఒక పిల్లి,
వెలగనా ఆగిపోనా అన్నట్లు
మిణుకు మిణుకుమంటూ రోడ్డు పక్కన
వీది దీపం కాంతి ....
కుశల ప్రశ్నలు వేస్తూ,
ఒంటరి గుండెతో మాట్లాడుతూ ఉన్నాయి .... మౌనంగా
నేను నిన్ను విడిచి వెళ్ళడం లేదు .... అని

Thursday, March 27, 2014

ఆమె నా మనో సామ్రాజ్ఞి




ఇన్నినాళ్ళ నుంచి అని చెప్పలేను.
ఎన్ని యేళ్ళుగానో
నేను ఈ ఆలోచనల కుటీరం లో .... ఆమె కోసమే
బస చేస్తూ ఉన్నది.

ఆమె కోసమే ఈ మాటలు,
ఈ బాష, ఈ పలకటం నేర్చుకున్నది.
నా శరీరాన్ని, నన్ను బలోపేతం చేసుకున్నది.
ఆమె ఇష్టపడుతుందనే నాకుగా నేను బరువు పెరిగింది.

నా జీవితం లో నేను ఎదురుచూసింది
కోరుకున్నది.
ఎదురుచూసి పొందిందీ
సంద్యా సమయంలోనో
సూర్యోదయ వేళల్లోనో
ఆకస్మికంగా నో
అలవోకగా నో .... ఎప్పుడైనా
కనుసన్నల్లోంచి ఆమె నన్ను చూస్తుండటాన్నే  




ఎన్ని యేళ్ళు గడిచినా
ఎందుకో తెలియదు .... ఇంకా
ఈ గుండె కొట్టుకోవడం మానలేదు.
ఆమెను చూసి తీవ్రంగా .... పక్కటెముకలు అదిరేలా

ఒక్క రాత్తిరిని కూడా నేనెరుగను
ఆమె అనుగ్రహము ఆమె అనుమోదము పొందని
ఆమె తోడులేని నిద్దుర కలల లోకి ....
నేను జారడం

మేలుకొనే వేళల్లో నా కనురెప్పలకు
తెల్లవారినట్లు తెలియదు.
వేడి వేడి నిద్దుర కాఫీ పరిమళాలతో
ఆమె గోరువెచ్చని స్పర్శ, పరామర్శ .... నన్ను తట్టేవరకూ