కలో నిజమో
Friday, October 31, 2025
కాలం కరిగింది
నిశ్శబ్దం నన్ను ఆలింగనం చేసుకున్న భావన
నేను మునిగిపోతున్నాను ....
ఒక సరస్సులో రాయి పడినట్టుగా
శబ్దం లేకుండా, అలల అల్లరి లేకుండా,
లోతుల్లోకి ఇంకా లోతుల్లోకి జారి కరిగిపోతూ
నా చుట్టూ ఉన్న ప్రపంచం
మెల్లగా కరిగిపోతోంది.
ఒక పాత జ్ఞాపకంలా,
తెల్లని పొగలా మారి మాయమైపోతోంది.
నా ఆత్మ తుక్కలై తుక్కలు విడిపోతున్నాయి.
ఒక్కొక్క తుక్క దూరంగా తేలుతూ
నీటి అడుగుకు .... నిశ్శబ్దంగా చేరుకుంటూ
రోజు ముగిసింది ....
మిగిలిందేమిటంటే ఒక తేలికైన శ్వాస,
ఒక సున్నితమైన నిశ్శబ్దం,
మరియు నేను నన్నే దూరం నుండి చూస్తూ
Saturday, September 20, 2025
అంతా కొత్తే
ఎన్నడూ అనుభూతి చెందలేదు
ఇక ఎప్పుడూ సంతోషంగా ఉండలేనేమో అన్న భావనే ....
వెంట వెంటనే గుండె బ్రద్దలైన బాధ
కానీ, ఏదో ఒకరోజు అంతా ఇలా మారుతుందని
అనుకోలేదు .... ఎవరో జీవితంలోకి వస్తారని
ముందెన్నడూ లేని అనుభూతిని కలిగిస్తారని
ఎప్పుడో అప్పుడు ఏదో జరుగుతుంది
మనం చేయగలిగేది కేవలం నవ్వుకోవడం మాత్రమే
గుండె మళ్ళీ కలపబడుతూన్నట్లు అనిపిస్తూ
భయం మాత్రం ఉంది .... ఔనా!?
Thursday, September 18, 2025
Wednesday, September 17, 2025
నిశ్శబ్దరాగం
కన్నీళ్లు ఆమె చెంపలను అల్లుకుని
.... మెల్లగా జారుతూ
అవి అతని పెదవులవైపు జారి ఆ బాధను
మౌనంగా పంచుకున్నాడు అతను
ఒక నిశ్చల ఆలింగనంలో, మౌనంగా
వారు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు.
ఆ ఇద్దరికీ తెలుసు,
ఆ గదిలో, వారి శరీరాలు, ప్రేమ మాత్రమే కాదు
ఒక దొర్లిపోయే వీడ్కోలూ వారి మధ్య ఉందని.
అతడి కన్నుల్లో బాధ ఈతేస్తూ,
ఆస్వాసం గాలిలా విరుస్తూ
ఆమె శిరోజాలతో ముడిపడుతూ ....
అతడు ఆమెను మరింత దగ్గరకు లాగాడు.
ఆమె పెదవులు కంపించాయి
అతడి ఊపిరి అసమానంగా మారి
ఆమె పెదవులు .... ఆ నిశ్శబ్ద క్షణంలో
అతడి పెదవులతో మెల్లగా జతవుతూ
Monday, September 15, 2025
ప్రత్యక్ష జ్ఞానం
కీళ్ళవాతంతో వంగిన ఆమె వేళ్లు
రంగు వెలిసిన తోలు కాగితం మడతలు విప్పి
.... పొదిగిన పొడిపొడి అక్షరాల కన్నీళ్ల, మాటల
మరకల అస్పష్టతను .... అనుభూతించాలి అని
కానీ, అంధత్వం ముదిరిన ఆమె కళ్లకు
ఏమీ కనిపించక పోయినా ....
ఆ కాగితం మడతల్లోని మనోభావనలు మాత్రం
అన్ని నాళ్ళ తర్వాత కూడా ....
పూర్ణ ప్రత్యక్ష జ్ఞానం పొందిస్తాయనే ఆశతో ఆమె
Friday, September 5, 2025
ఏకైక మార్గం
అనుకోని మార్పు
జీవితంలో ప్రవేశించినప్పుడు
నాకు తెలియకుండానే
ఒక ప్రశ్న ఉద్భవించింది.
ఇప్పుడే ఇది ఇలా
ఎందుకు జరుగుతుంది అని?
నేను నిర్మించుకున్న
ఏకాంత కట్టడంపై
ఇలా కూలిపోయేంత
తీవ్ర ప్రభావమా అని?
కళ్ళ ముందు ఒక్కసారిగా
పెద్దగా తెరుచుకుంది ప్రపంచం
నేను నిలబడే ఉన్నాను
అసహాయంగా ....
రక్షణ కోసం గోడలు లేకుండా
మార్గం చూపే చిహ్నాలు లేకుండా
కేవలం ఇతరుల మాటలు
మదిలో ఆశలు మాత్రమే మిగిలి
నేను సిద్ధంగా లేను
ఎప్పటికీ సిద్ధంగా ఉండను
కానీ ఎప్పటికైనా
ముందుకు వెళ్ళే ఏకైక మార్గం
దాటడమే
Thursday, August 7, 2025
పైకి లేవాలి!
పడిన చోటు నుండే ....
అణిగిపోయాను, ఓడిపోయాను...
నా గొంతుకను నేను అణచుకోవడం తప్ప, నాకు వేరు దారి లేదు.
ఇప్పుడు నేను, నీ సాంగత్యానికి దూరంగా వెళ్ళాలి.
రేపు లేని ఒక మూలలో ....
నేను కేవలం ఒక నీడలా
వానలో తడుస్తూ నడుస్తున్నాను,
నిస్సత్తువగా, నీరసంగా ....
రాత్రి చలిలో వణుకుతూ,
చీకటిలో నా చూపును కోల్పోయి.
ఇది ఓడిపోయే సమయం.
నువ్వు ఆమె మమైకమైపోయి నవ్వుతూ
ఇక నువ్వు నాతో ఉండవు ....
కేవలం ఆమెతోనే
ఓటమి అంటే ఏమిటో నాకు పూర్తిగా అర్ధమైంది.
నువ్వు నాతో లేవని .... నువ్వు ఆమె వేరుకారని.
కానీ, ఇది ముగింపు కాదు.
ఇది కేవలం ఒక జ్వరం.
ఈ గోడను బద్దలుకొట్టుకుని నేను బయటపడాలి.
నేను పడిన చోటు నుండే .... పైకి లేవాలి!
కలగంటా
కలగంటా .... ఈ రాత్రి నిద్దురలో నీ గురించి
లోకం తప్పుపట్టేదేమో అనిపించే వాటి గురించి
నీ స్పర్శకై నేనెంతగానో ఆరాటపడతానో, ఆ స్పర్శకై
నీతోడి భవితకై నాకున్న ఆశ గురించి
కలగంటా .... ఆ కొత్త అనుభూతికై, నాలో కలిగే ఆ పులకింతకై
ఎంతో అపురూపం, నా పాలిట సర్వస్వం అనిపించే దానికోసం
నాకు పట్టలేని పరవశమిచ్చే, ఆ ఆనందం కోసం
తప్పకుండా నా జీవితాన్నే మార్చేస్తుందనే నమ్మకంకై
కలగంటా .... మనం పంచుకోనున్న తీపి గురుతులకై
ఒకరికొకరం పంచే ఆప్యాయతతో గడిపే సుందర క్షణాలకై
హృదయాన్ని ఉప్పొంగించే కలను నేను కంటా
కలల లోకం వీడగానే, అదే గుండెను ముక్కలు చేసే కలను కంటా
నే చెప్పేది ఓ కల కథనం
నన్ను ఉద్ధరించే ఓ కల, నన్ను విడిపించే ఓ కల ....
చాలా కాలంగా నాకిష్టమైన నాకు దూరమైన దాన్ని ....
నా జీవితం .... ఇప్పుడిలా వెలితిగా, తప్పుగా తోచే నా జీవితం
నిజమవ్వాలనే ఆశ, అయినా తీరదేమోనన్న సంశయం నింపే కల
ఏమైనా సరే, నేనెలా ఉన్నా, ఆశగా నేను ఎదురుచూసే కల
ఇది నా కలల కల, నాలోని ఓ స్వప్నం
ఈ కల, ఎప్పటికైనా నిజమైతే, వద్దనను ఏనాటికీ
Wednesday, August 6, 2025
క(అ)లలు
జీవితం ఒక ప్రవహించే ప్రవాహం
విభిన్న తీరాలకు తీసుకువెళ్తూ
అందుకే .... కాసింత సమయం తీసుకో
నీ గురించి నీవు కలలు కనేందుకు
నువ్వు ఏవిధంగా ఉండాలనుకుంటున్నావో
ఎవరిని
నువ్వు చూసేందుకు తహతహలాడుతున్నావో
వారికై .... కొంతసేపు కలలు కను
ఆ ఎవరో గురించి
నిన్ను చిరునవ్వుతో మురిపించే ఆ వ్యక్తి గురించి
నీవు చేయాలనుకున్న పనుల గురించి
ఈ ప్రపంచానికి
చివరిసారి వీడ్కోలు చెప్పే ముందు వరకూ
అన్ని విషయాల గురించీ కలలు కను
Thursday, July 31, 2025
Tuesday, July 29, 2025
లక్ష్యసాధన
ఎప్పుడు ఎలా ఉన్నా, ఏది ఎదురైనా
వెనక్కి తిరిగి చూడకుండా
ముందుకే సాగాలి
దారి ఏదైనా .... ఏది ఎదురైనా
ఎవరేమి అనుకున్నా
మన లక్ష్యం .... జీవితంపై గెలుపు
జీవితం ఒక సవాల్
ప్రతీ పరాజయమూ
ఒక పాఠం
సక్రమమైన సిద్ధతతో
విజయపదం వైపు
కదిలే క్రమంలో .... మనం
సమర్థతను కౌగిలించుకుని
సోమరితనం
దూరంగా పెడదాం
విజయసాధన .... గెలుపు కోసం
పాదాలకు బలమిచ్చి
ముందు ముందుకే కదులుదాం
Monday, July 28, 2025
Thursday, July 24, 2025
నీవు నేను
నీ కళ్ళే .... అంతులేని
నేను మునిగిపోవాలి అనుకునే
లోతైన నిఘూడ సాగరం
నీ శరీరం .... సుదూరంగా
నేను పదే పదే, సంధ్య నుండి ఉదయం వరకు
అలలా వచ్చి తాకాలనుకునే తీరం
నీ ఆత్మ .... అనంత అగాధం
నా రహస్యాలన్నింటినీ
భద్రంగా దాచుకోవాలనిపించే అంతరాళం
నీ ప్రేమే .... నా నివాసం
నీ అలల తాకిడితో
నన్ను తీరం చేర్చే పరిపూర్ణత్వం
Tuesday, July 22, 2025
విరిగిన మనసు
ఏ ప్రయత్నమూ లేకపోయినా ....
మనసులు విరుగుతూ ఉంటాయి
చివరి ముద్దులో తడిపిన భావాలు
చెవిలో ఊగే గాలిలా
విసురుగా తాకే బాధగా మారి
కాలం నా కోసం నీ కోసం ఆగదు
మన ప్రేమకి రెక్కలు రావు
తాకాలన్న కోరిక లోపల ఉరకలేస్తూ
మధ్య మిగిలేది గాలి మాత్రమే
ఒక పాట .... రాగం లేకుండా
పాడే శక్తిని కోల్పోయినట్లు
పట్టుకోలేనంత త్వరగా
విడిపోతున్న క్షణాన్ని పట్టుకునే ప్రయత్నం ....
గాలిలో వేలాడే తలపులా
చీకటి కవిత
Thursday, July 17, 2025
Tuesday, July 15, 2025
ఇంకా గుర్తుంది
చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు
సంగీతం వింటూ చెప్పుల్లేకుండా
నేను నాట్యం చేసినప్పుడు
లక్షల జనం ఉన్న వీధుల్లో
నేను నడుస్తూ
ఏ చప్పుడూ వినపడనప్పుడు
నా కళ్ళలో చెమట బొట్లు పడి
చురుక్కుమని మండుతున్నప్పుడు
ఇళ్ళు మంటల్లో కాలిపోతూ
అబద్ధాలు భయంగా మారిపోయినప్పుడు ....
నాకు ఇంకా గుర్తుంది
ఇంకా ఆ ....
ఆ లెక్కలేనన్ని కన్నీళ్ళు బొట్లు
Saturday, July 12, 2025
Friday, July 4, 2025
నువ్వున్నావని
నాకు తెలుసు నువ్వు ఉన్నావని
నీకు అర్థమవుతుంది అని
ఇది నా మనసులోని మాట
రెండు ముఖాలున్నాయి లోపల
నవ్వు, ఏడుపు
ప్రేమ, ద్వేషం
నీకు తెలుసు నా నిజం, అబద్ధం
అందుకే అడుగుతున్నా
అతను లేకుండా రేపు ఎలా?
ఇక దాచలేను
"బాగున్నావా?" అని మళ్ళీ అడుగు
నా గాయం నీకే కనిపిస్తుంది
నా కన్నీళ్లు ఈ అక్షరాల్లోనే ఉన్నాయి
ఎవరికీ వినిపించవు
కానీ మనమంతా ఈ బాధలోనే ఉన్నాం
వెళ్లిపోవాలని ఉంది
ఉండిపోవాలని ఉంది
నాకు తెలుసు నువ్వు ఉన్నావని
నువ్వు ఉండు
నేను వెళ్తున్నా ....
కాసేపటికే .... తిరిగి వస్తా
పగటి నిద్ర
అది మైకం కాదు,
అదో వింత అనుభూతి
మెత్తని సోఫాలో జారుకుని
లోతైన నిద్రలో
లాలిపాటను శ్వాసించినట్లు
కానీ అది హాయి యా,
నేను మేల్కొనే క్షణమా?
మెత్తదనం నుండి నెమ్మదిగా లేస్తూ,
నా ఆత్మ పైకప్పుకు తాకి
అప్పుడు విన్నాను
పైకప్పు మీద పడే వాన చప్పుడు
రాళ్ళు తడుస్తున్నట్లు
అది
కురుస్తున్న నా కన్నీళ్ల చప్పుడు
Thursday, June 26, 2025
నేనూ ఆమె
బస్సులో ఆమె
కాస్త దూరంలో కారులో నేను
ఆమె నా వైపు కిందికి చూస్తూ
కాలంలో ఘనీభవించాం ఇద్దరం
నేనూ ఆమె వైపే చూస్తున్నాను
కానీ ఆ చూపు ఆ ఆసక్తి వేరు
నిజమే, ఆమె పట్ల ఎందుకో జాలి
ఆమె ఎవరో .... ఎక్కడికి వెళ్తుందో
ఒక్క చూపులోనే కలిశాయి
మా మనసులు
నా ముఖం, కిటికీ అద్దం,
అద్దంలో ఆమె రూపం
ఆమె అలసటగా నిట్టూర్చినట్లనిపించింది
మరుక్షణమే బస్సు బయల్దేరి
ఆమె ఆమె బతుకు దారిలో
నేను నా దారిలో
ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నా ....
బస్సులోని ఆమె గురించి
నాకు ఇంత ఆసక్తి ఎందుకూ అని
ప్రేమంటే!?
Thursday, June 5, 2025
ఈ చోటు నే
సంతోషం కోల్పోయినప్పుడు
కొన్నిసార్లు స్పష్టమైన కారణమేదీ లేకుండానే
నేను ఒంటరిని అనిపిస్తుంది.
అన్నీ సరిగ్గానే జరుగుతున్నా, ప్రేమతో చుట్టబడి ఉన్నా
సంతోషంగా ఉండటానికి నా దగ్గర అన్ని కారణాలూ ఉన్నా
విలువైన స్నేహితులు
అందమైన కుటుంబం
అపారమైన ఆశీస్సులు
మరియు అదృష్టము ....
అయినా సూర్యుడికి నీడ, దాని వెచ్చదనం నాకు తగలదు
గులాబీకి సువాసన లేదు, పక్షుల గానం నిశ్శబ్దంగా
కాకి అరుపు మాత్రమే వినిపిస్తూ
తప్పంతా నాదేనని నన్ను నేను నిందించుకుంటూ బాధ ....
ఆందోళనతో కూడిన ఆడ్రినలిన్ నాలో ప్రవహిస్తూ, పిలవకుండా వచ్చే కన్నీళ్లు
మళ్ళీ నేను ఒంటరిని అనిపిస్తూ
నేనెందుకిలా ఉన్నాను?
నా జీవితాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నా ఈ దుఃఖానికి నేనే అపరాధినేమో
ఎందరో నాకన్నా తక్కువ అదృష్టవంతులు, వారి తప్పేమీ లేకున్నా
అద్దంలో నన్ను నేను చూసుకుంటాను
నన్ను నీడలా వెంటాడుతున్న ఆ వికారమైన మృగాన్ని చూస్తూ
దుఃఖపు దుర్గంధం నా ప్రపంచమంతా వ్యాపిస్తోంది
దాని బిగ్గరైన, బరువైన శ్వాస నా చెవులను, దయకోసం నేను చేసే ఆర్తనాదాలతో నింపుతోంది.
దాని ముందు కుంచించుకుపోయి, భయంతో ముడుచుకుపోయే అవకాశం ఉన్నా
నేను దృఢంగా వెనుదిరిగి దాన్ని ఎదుర్కొంటాను
నీ ఆలోచనలు నన్ను ధైర్యవంతురాలిని చేస్తున్నాయి
దానికి వ్యతిరేకంగా నిలబడటానికి, దాన్ని అదుపులోకి తీసుకోవడానికి పోరాడటానికి శక్తినిస్తూ
మరోసారి, ఆ మృగాన్ని బలవంతంగా దూరం నెట్టి, నేను పైచేయి సాధించాను
ఇప్పుడు నా ఆత్మవిశ్వాసం కొంచెం సడలినా.
అయినప్పటికీ...
....నేను ఒంటరినే
Sunday, May 25, 2025
Friday, May 23, 2025
చీకటి సంకెళ్ళు
వెలుగు లేదు అక్కడ ఆశ లేదు
అక్కడ ఈ అగాధంలో బందీనై
ఆ చీకటి గుసగుసల్లో
కరుడుగట్టిన చల్లదనం కౌగిట్లో
ప్రతి నీడలోనూ నేనూ నా రూపమే
అంతంలేని చీకటి సంకెళ్ళతో
బంధింపబడి
పోరాడేందుకు శక్తి సన్నగిల్లి
కూసింత కూడా వెలుగు జాడ లేక
ఆ బాధ,
ఆ మధురమైన బాధ
ఆ బాధే నాకు నిరంతర తోడు
నన్ను బంధించిన గొలుసులు
ఈ నల్లని చీకటి రాత్రి లోతుల్లోనే
నేనలా నిస్తేజంగా ఉండిపోయాను
ఆ నీడలే గెలిచాయి
ఇక నేను ఆ స్థితిలోనే ఎప్పటికీ
Tuesday, May 20, 2025
Monday, May 19, 2025
వేధించే కల
నా గుండెలో ఏవో అరుపులు పదే పదే
ప్రతిధ్వనిస్తూ అనర్ధపు కలలు ....
నా మనస్సు లోలోతుల్లో కురుస్తూ
లబ్ డబ్, లబ్ డబ్, లబ్ డబ్
నా నాడి విపరీతంగా కొట్టుకుంటూ
శూన్యంగా మారి .... ఊపిరి అలజడి
నా గుండె గోడలు ముక్తంగా
మరుగున ఆవేదన చెందుతూ కూడా
భావనలేవో నా మనసును మెల్లగా తింటూ
ఈ తాళిని, ఈ గొలుసును
వెన్నెముకను పట్టేసిన లతల్లా లాగుతూ
ఇప్పుడు నన్ను ఆకర్షిస్తున్నది
నా చేతులపై చెరిపలేని గాయాల గీతలు
ఆ ప్రతి గీత ఎర్రగా రంగవల్లి లా
ఒక పూలమాలలా గులాబీ తోటలా
ప్రతి గులాబి పూరెక్క .... ఒక చుక్కగా
నేను నీకు వ్రాస్తున్న ఈ ఉత్తరంపై
రక్తమై కారి .... నిద్రలో కలలో మాత్రమే
నీతో జీవించాలి అనిపిస్టూ .... వేధిస్తూ కల
ఊపిరిలు
Saturday, May 17, 2025
బహుశ
ఈ రాత్రే నాకు అవగతం అయ్యింది
జీవితాలు మంత్రించినట్టు కలిసిపోవు అని
నిజానికి
ప్రేమ మాత్రమే చాలదు, బంధాలు నిలబడడానికి
ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నంత మాత్రాన
అంతా అద్భుతంగా, ఆనందంగా మారిపోదు
ఆ బందం, ఆ ఆనందం నిలవడానికి
వారిలో తెలివి కావాలి .... శ్రమించాలి
కొన్ని ఉత్తమ లక్షణాల్ని త్యాగం చేయాలి
సహచరి తో .... జీవితం సరిగ్గా నిలవడానికి
చిరకాల స్వప్నాలు కొన్నింటిని వదులాల్సి వస్తుంది
సచరి చేయి పూర్తిగా అందుకోవడానికి
ఇదంతా వెర్రిగా, నమ్మశక్యంగా లేదు కదూ
నువ్వు ఒక ‘వెర్రి ప్రాణిని’ ప్రేమిస్తున్నావు
ఆ ‘వెర్రి ప్రాణి’ కూడా నిన్ను ప్రేమిస్తోంది
మీ ఇద్దరి బందం బాగుంటుంది అని
ఈ క్షణానికే కావొచ్చు .... అది మీ నమ్మకం
ప్రతి రోజు గుర్తుచేసుకోవాలి ....
ఎందుకు ఆమే కావాలని అనుకున్నావో
చీకటి రోజులకు సైతం, చిరు వెలుగును పంచే
నీకు తెలియని క్షణాల్లో కూడా ....
ఆమె నిన్నెలా సంతోషపరుస్తుందో తలపుల్లో అని
నమ్మకం పెంచుకో ఈరోజు, రేపు, రాబోయే ప్రతి రోజూ
ఎందుకంటే 'శాశ్వతం' అంటే అనంతం కాదు
బహుశా, శాశ్వతం అంటే
ఈరోజు నుండి .... మొదలయ్యే ప్రతిరోజు నేమో
Wednesday, May 14, 2025
నీ జ్ఞాపకం
ఒక ఎర్ర గులాబిలా తియ్యగా
ఆ గులాబి ముల్లు చేదులా
నా చేతిని మృదువుగా తాకే
ప్రతి రెక్కపై ముత్యాల్లా మెరుస్తూ
ఆ వర్షపు ముద్దులు
నేను నిన్ను గుర్తుచేసుకుంటూ
తనివిగా నడుస్తూ,
పదిలపరుచుకున్న నీ జ్ఞాపకాల
తడి నేలను చూస్తూ
పొడిస్థలం కోసం వెతుకుతున్నాను
నా జ్ఞాపకాల పుష్పాన్ని
ప్రపంచానికి చూపించేందుకు
ఆ జ్ఞాపకం శాశ్వతంగా నిలవాలని
నీతో వచ్చిన జీవం
ఈ లోకానికి నీవిచ్చిన వెలుగు
అన్ని దుఃఖాల నడుమ
కాంతిపులకరించు స్పర్శై ఉండాలని
విరిగిన హృదయం
ఆ చాటు మాటు అబద్ధాల
మూటల భారం
తలలో జ్ఞాపకాలుగా మిగిలి
ఆ పరామర్శలో హృదయం లేదు.
ఆ కళ్ళలో కారుణ్యం లేదు.
చుట్టూరా మూసుకుపోయినట్లు
అదో అనాశక్త అప్రియ భావన
ఎక్కడో శిథిలాలలో
సమాధి చేయబడినట్లు
అనిశ్చల పరితపన అన్వేషణ
నిజం కనుగొనబడిన్నాడు
విరిగిన మనసుకు మిగిలేది
కేవలం నష్టం కష్టం మాత్రమే
ఒప్పు తప్పుగా
ఎక్కడ మారిందనే శోధనలో
ఇష్టపడని స్పర్శతో మలిన పడిన
సమర్పణా భావన
మళ్ళీ ఒకప్పటిలా
తలరాతను మురికిమయం చేసి
నిరుపయోగంగా విసిరేయబడ్డ
విరిగిన హృదయం అదిగో
అక్కడే పక్కన కనిపిస్తూ ....
Tuesday, May 13, 2025
Sunday, May 11, 2025
కల కనాలి అని
Tuesday, May 6, 2025
అబలను తప్పిపోయాను
జీవయానం
అర్థం చేసుకో .....!
జీవరాగం
జ్ఞాపకాల గతంలోనే
Friday, March 21, 2025
నీ నీడను నేను
నీ నీడలా నడవడం ఒక ఉల్లాసం లాంటిది
నీ నీడలానే నడుస్తున్నాను
నిజం చెప్పాలంటే ....
నా భవిష్యత్తు గురించి నేను భయపడుతుంటాను.
అందుకే నన్ను ....
నేను ఏర్పరచుకున్న గోడల వెనకాలే దాచేస్తాను.
కానీ
ఆ గోడలు ఇసుకగోడల్లా విరిగిపోతున్నాయి.
నీలో ఏదో ఉంది.
నా చుట్టూ నేను కట్టినగోడలు తట్టుకోలేని శక్తిలా
నువ్వు వాటి మధ్యకు చేరిపోతున్నావు.
నీవు నన్ను, నా ఆత్మను తాకేస్తున్నావు
నిన్ను ఎలా ఆపాలో నాకు తెలీదు.
నువ్వు నా కళ్లలోకి చూస్తావు.
అప్పుడు నేను ఓ పుస్తకంలా మారిపోతాను
అది నీవు ఇంకా పూర్తిగా చదవలేని భాషలో రాయబడి
బహుశ
నీకు ఎదురైన ea ప్రశ్నల సమాధానం కోసmoa
అయ్యుంటుంది నీ నీడలా నడవడం ఉల్లాసం నాకు
చూస్తూ వింటూ నేను
చూస్తూ
ఉదయాన్నే వాకింగ్ కు వెళ్ళినప్పుడు,
నాలా నడుస్తూ మాట్లాడుకుంటున్న ఎందరినో
ఆకాశంలో ఎలాంటి ప్రయాస లేకుండా తేలిపోతున్న మేఘాల్ని
ప్రతి రోజూ ....
మనుషులు, జంతువులు, చెట్లలో పక్షులు
నిలబడి, నడుస్తూ ఎగురుకుంటుండటాన్ని
ఉదయాన్నే వాకింగ్ కు వెళ్ళినప్పుడు,
నా పక్కనే వేగంగా వెళ్తున్న కార్ల శబ్దాన్ని
పైన గగనతలంలో ఎగిరే విమానాల హోరుల్ని వింటూ
ఆడుకుంటున్న పిల్లల ఆనంద హర్షాల్ని
స్వేచ్ఛగా కదులుతూ నేను