అర్థం చేసుకో .....!
నువ్వు నా మంచి లక్షణాలే కోరుకుంటున్నావు.
నీకు ఉత్తమమే కావాలి.
మరి నా చెడు లక్షణాల సంగతేమిటి?
నేనొక సామాన్యుడ్ని
అర్థంకాని కళలా మనిషి హృదయం అనంతంగా
విస్తరించి ..... ఉంటూ
ఏ మనిషిలోనైనా, లోపాలు సహజం
కానీ నేను అపరాధిని కాను.
అపరాధ పరిణామాలెలా ఉంటాయో నాకు తెలుసు.
నేను ఎన్నో తప్పులు చేసాను ..... ఇంకా చేస్తూ ఉన్నాను.
ఆ పరిణామాల్లోంచి ..... పాటాలు నేర్చుకుంటూ ఉన్నాను.
మార్పు సహజం అని నమ్ముతాను.
కనుక, కాలంతో పాటు మార్పు చెంది
మెరుగు పడేందుకు ప్రయత్నిస్తున్నాను.
నీవు నీ అద్భుతమైన ఊహల కలల్లోకి నన్ను నెట్టే
ఎలాంటి అనూహ్య పరిణామాలు వద్దు.
కేవలం ..... నీ లోపాలు నేను అంగీకరించినట్లే
నీవు నా లోపాలు అంగీకరించాలని ఆశ, నన్ను అర్థం చేసుకో
No comments:
Post a Comment