అవసరానికి నివాసం ఉండేందుకు
మానవత్వం కానీ
నా హృదయం కానీ
విడిది గృహాలేం కాదు
నా జీవితం ఒక అగ్నిగుండమూ కాదు
వెచ్చదనాన్నిచ్చి ఊరడించడానికి
నా బాహువులు కోటగోడలు కావు
సంరక్షణను సమకూర్చడానికి
అంతరంగంలో చెలరేగే పెనుతుఫానుల్నుంచి
నా హృదయం అయస్కాంతం మీట కాదు.
పొందాలనుకున్నప్పుడల్లా నొక్కేందుకు
ఎన్నాళ్ళని నీ ఈ పశ్చాత్తాపాల భారం మొయ్యగలను.
కాళ్ళు చచ్చుబడి నిలువెల్లా నీరసం
మన ఇరువురి భారం మోయలేక
చిల్లులు పడిన
నా శూన్య హృదయమే సాక్ష్యం
దీనికి సమాధానం నీకు తెలుసు
కానీ నీవు నిర్ణయించవు.
ఆ శూన్యాన్ని నింపడమెలాగో .....
తలుపులు తట్టావని
ఎలా రానివ్వను నిన్ను లోనికి
ద్వారం దగ్గర డోర్ మాట్ లా
వాడుకోవడం న్యాయం కాదు. నేరం
అలా వాడుకుని
మళ్ళీ తట్టి చూస్తున్నావు
అందుకే హృదయద్వారాలు
శాశ్వతంగా మూసుకుపోయాయి.
No comments:
Post a Comment