Saturday, March 26, 2016

అది ప్రేమో ఏమో



నిన్ను నేను కోల్పోయిన ఆలోచనే
నన్ను కృంగదీసి చంపేస్తుంది.
ఎంత దూరంగా ఉన్నా
ఏ కలల్లో, ఏ స్వర్గం లో నివశిస్తూ
విహరిస్తూ ఉన్నా
నీవు నన్నే ఆలోచించాలి

నాకంటే సన్నిహితులు నీకు
ఉండరాదు ఎవ్వరూ
ఉన్నారేమో .... అనిపించినా 
నన్నిక్కడ
జీవత్శవాన్నిలా వొదిలి
అది ప్రాణాంతకమే నాకు

ఎన్నిసార్లు నీవు
ఎన్ని విధాలుగా విడమర్చినా
జరిగింది మాత్రం
అంతా నీవైపునుంచే అని
మన ఇరువురికీ తెలుసు.

ఎప్పుడైనా నా మనసులో
ఏముందో
మన అనుబంధాన్ని
ఎలా నిర్వచిస్తానో
ఏమి చెప్పాలనుకుంటున్నానో
నీవు తెలుసుకోవాలనుకోలేదు. 


నాకేమో చెప్పాలనిలేదు
మనస్కరించడం లేదు ఇప్పుడు
ఎందుకంటే
నీవిప్పుడు నేను గుర్తించుకోదగని
మరొకరివి .... నీ ఇష్టంతో
నాకు మరీ దూరమయ్యి 


నిజం వాస్తవం మాత్రం 
నేన్నిన్ను కోల్పోలేను.
చూడకుండానూ ఉండలేను.
బ్రతకలేను.
నేను కోల్పోగలిగింది, 
ఇప్పటినిన్ను కాదు.
ఒకప్పటి నిన్ను మాత్రమే

నిజంగా నిజమేమిటో 
జరగబోత్రుందేమిటో 
నువ్వెవరివి కాబోతున్నావో
నేడు నేనెరుగకపోయినా
కష్టమే ....  అపరిచితురాలిగా
నిన్ను చూడాల్సిరావడం

ఓ మానసీ 
ఏ విధంగా 
ఆలోచించినా
నెన్నిన్ను కోల్పోలేను.
చూడకుండా ఉండలేను
బ్రతకలేను.

అందుకేనేమో అనుకుంటుంటాను.
నీకైతే సులభమేమో అని 
కాలంతో పాటు కదలడం
మరిచిపోవడం 
మన పసితనం 
పసిడి జ్ఞాపకాలను .... నన్ను

అలా అనుకోవడం
నీకూ సాధ్యమా అని 
అనుకుంటూనే అనిపించడమూ
భారం అనిపిస్తుంది గుండెకు
నిజం చెబుతున్నా
ఒట్టేసి మరీ

కొన్ని నిజాలు
ఇంత వేదనాభరితమూ 
తీపి విషమ అని
జీర్ణించుకోవడం
ఇంత కష్టమా అని 
అనిపిస్తుంటుంది

అయినా నా వరకు నేను
నీకు స్వేచ్చను
ఇచ్చెయ్యాలనే అనుకుంటున్నాను.
నన్ను ఒంటరినిగా
ఉంచుకునేందుకు సంసిద్దుడ్నై 

No comments:

Post a Comment