నా కళ్ళలోకి లోతుగా
నొప్పిపై ముసుగేసుకున్న మందహాసాన్ని చూడు
ఆ మందహాసం చాటున
భద్రంగా దాగిఉన్న కన్నీటిని చూడు
నీకు కనిపిస్తున్న ఆ మెరుపు కన్నీటిదని నాకు మాత్రమే తెలుసు
ఆ నిజం అక్కడ పక్కనే ఉన్నా చూడలేవు నీవు
నా మనసు చుట్టూ నేను కట్టుకున్న
ఆ అభిమానం గోడను నీవు చీల్చలేవు
సామాన్యత నేను మాత్రమే కనిపిస్తుంటాను నీకు
అంతా సర్ధుమణిగిన సాధారణ స్థితే కనిపిస్తూఉంటుంది.
గబ్బిలం లా భయం అనే
బలమైన గోడ అంచుకు తలక్రిందులుగా వ్రేలాడుతూ
ఎప్పుడైనా నాకు నీ పిలుపు వినిపిస్తూ ఉంటుంది,
ఆలాపనలా .... భావోదేగుడ్నౌతుంటాను.
తారతమ్యాల గోడలను బ్రద్దలు చేసేద్దామనిపించేస్తుంటుంది.
గోడ ఇటుకలు కట్టుబాట్లు దూళిగా మారిపోయే
పిడిగుద్దొకటి గుద్దాలనిపిస్తుంటుంది.
అంతా ఊహే .... అంతా అనుభూతే
ఎదురుగా నిన్నూ నీ ముఖం లో ఆశ్చర్యాన్ని చూస్తున్నట్లు
అనూహ్యంగా దూసుకుని వచ్చి
దగ్గరకు తీసుకుని కళ్ళముందున్న నీ చెయ్యందుకుని
నేనున్నాననే ఆస్వాసన ఇవ్వగలిగితే నీవు స్వాగతిస్తే .... ఊహ
అలాంటి ఎన్ని వింత ఊహలో కలలో
ఆ కలల ఊహల్లోంచి ఉలిక్కిపడి
వాస్తవికతలోకి రాక తప్పేదు .... నిరుత్సాహపడక
సామాన్యుడ్నై అప్పుడు .... నీ వైపు చూస్తుంటాను.
ఆ కోరికలు ఆ ఊహలు వాస్తవాలు కావాలని
గొప్ప గొప్ప పదాల్లోని ఔన్నత్యాన్నిలా
నన్ను నేను నీ కళ్ళముందు నిలబెట్టుకోవాలని
నీవు చూడాలి అనుకునే ఈ భావనలు ఈ కోరికలతో
నా ఆలోచనలకు రెక్కలొచ్చి ఎగరాలనుకుంటాను.
నీ పరిచయాన్నీ నీతో ఉన్న అనుబంధాన్ని
నాలో నేను గొణుక్కుని కళ్ళు ఆర్పుతూ బిడియపడుతుంటాను.
ఆ భావనలతో సంబధం లేనట్లు నీవ్వెళ్ళిపోతుంటావు.
నీవు తిరిగి రాలేదెందుకు అని
ఇలా ఎన్ని నాళ్ళుగానో వేచి చూస్తున్నాను
రహదారి లో దూళి లా
No comments:
Post a Comment