ఎర్ర తివాచీ స్వాగతాలు పరచక్కర్లేదు.
తెరిచి ఉంచు .... నీ హృదయం తలుపులు
తాపసినై నివశించేందుకు వస్తాను. వింటాఉ.
విని తరించాలి. నిన్నూ నీ మది భావనల్ని
నీ జతనై ఉండిపోవాలి.
నాలాగానే నీవూ శాంతిని
ప్రశాంతతను కోరుకుంటున్నావని తెలుసు
నీతో జీవించాలనే జీవనావసరం ఏదో
ఎప్పటినుంచో .... నన్ను ప్రేరేపిస్తుంది.
ఎప్పటికీ నిన్ను సొంతం చేసుకోవాలని
నీవే ఉండాలి నా హృదయాంతరాళాలలో అని
అన్ని పరిణామాలకూ సిద్ధమై ....
అది తప్పో ఒప్పో మొండితనమో కానీ
నీ కళ్ళలోనే స్వర్గాన్ని చూడగలననిపిస్తూ
ఎన్నో తర్జనభర్జనలు మది మధనాల పిదప
నిర్ధారణైన వాస్తవం ఇది.
తొందరపాటు ఆకర్షణలో ఏర్పడే విపరీత
అపస్వరపు పలుకులు అనుకునేవు.
కానీ, ఏదో పిచ్చి నమ్మకం
నీవు తప్పక అర్ధం చేసుకుంటావు
నా మాటల్లోని నిజాయితీని స్వచ్చతను అని
ఎన్నో అనంత కాలాల నిరీక్షణల ఫలితం
మన ఈ కలయిక .... నిజం
నా శాశ్వత అపార తపోఫలం నీవు
తప్పో ఒప్పో మొండితనమో తెలియదు మరి
నా గుండెలో మాత్రం నీవే ఉండాలి అని,
నీ సాన్నిహిత్యం లో నీ కళ్ళలో మాత్రమే
స్వర్గాన్ని చూస్తూ నేను కరిగిపోవాలని
No comments:
Post a Comment