Sunday, December 20, 2015

నా జీవన సంజీవని .... నీవు


హిమవన్నగమూ సాగరమూ నావే అయితే
వాటిపై అంతటా నీ పేరే రాసేస్తాను.
ఆ ఆకాశం అసూయపడేలా, నీకు తెలిసేలా.
నేను నిన్నే చూస్తున్నానని
డబ్బుతో కొనలేని అమూల్య సంపదే నావద్దుంటే
దాన్నంతా అమ్మేస్తాను.
ఒకే ఒక్క అవకాశం పొందేందుకు
పిల్లా! ఉన్నదంతా గుమ్మరించేస్తా
నీ ప్రేమను పొందేందుకు, నీతో కలిసి జీవించేందుకు

నష్టపోను. అమిత సంపన్నుడ్నే అవుతాను.
నిన్ను కేంద్రబిందువుగా నిర్మించి నూతన ప్రపంచం
నీకు చూపించుకుంటాను.
తెలుసో లేదో నీకు .... నీవు నన్నెంత ప్రభావితం చేసావో
నా నవనాడులనూ శ్వాసనూ ఎంతగా ఊపేసావో
ఓ పిల్లా! నీకు నా ప్రేమను పరిచయం చేయ్యాలి.
స్వర్గం ఈవైపున, ఇక్కడ నీ మనోసౌందర్యం వైశాల్యం
ఎవరికీ తెలియదు .... నీ వ్యక్తిత్వ వైశిష్ట్యత ఏమిటో

నిజం చెబుతున్నాను. నాలో వింత నమ్మకం 
నీళ్ళమీద నడవగలనని, ఆకాశంలోకి ఎగరగలనని
నాకు మాత్రమే తెలుసు .... కారణం నువ్వని
ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఒక అద్భుతాన్ని, గొప్ప ప్రేమ రూపాన్ని 
నిన్ను నాకోసం సృష్టించాడని
నీ ప్రేమను పొంది, నీ ప్రేమ సామ్రాజ్యానికి .... ఏదైనా చేసి
సామ్రాట్టునయ్యే అవకాశం కల్పించి

నేనిలా మారిన క్షణం నుంచీ అనుకుంటున్నాను.
ముఖ్యమైన సంగతొకటి నీతో చెప్పాలి
నిన్ను భయపెట్టేవేవీ కావు నా ఆశలు కోరికలు అని
సూక్ష్మంగా సున్నితం గా నీతో చెప్పాలని
నీ నోట వినాలనీ ఉంది
నాలా నీవూ నన్ను ప్రేమిస్తున్నావు అని
పిల్లా! ఈ శరీరం కంపిస్తుంది.
నా శ్వాస వేగంగా కొట్టుకుంటుంది.
ఈ స్థితి లో ఔషధం సంజీవిని నీ ప్రేమే అని

No comments:

Post a Comment