సుమారు
ఎనిమిది మాసాలయ్యింది అని
నేను కోమాలోకి జారిపోయి
కోమాలోంచి ఇప్పుడే బయటపడ్డానని
ఎవరో అంటున్నారు.
అంతకు ముందు
ఒక మధ్యాహ్నం వేళ
అలసిపోయి నీరసంతో
అకస్మాతుగా నా మానసి పడిపోయింది.
జారిపోయింది నిద్దురలోకి
అప్పుడే అన్నారు ఎవరో
నాకెంతో బాధనిపించేలా
ఈ రోజు సాయంత్రానికి కోలుకోకపోతే
అప్పుడు బంధువులకు చెబుదాం
లేవదని అనుకుంటున్నారు.
నేను మాత్రం
అలిసిపోయుంటావు విశ్రమించు మానసా!
ఆరోగ్యంగా నిద్దుర లేద్దువు
విశ్రమించు కానీ
తిరిగి రావడం మానకేం అన్నాను.
కానీ మానసి వెళ్ళిపోయింది.
గుర్తుకొస్తూనే మళ్ళీ అంధకారం అయోమయం
లీలగా ఎవరో ఏదో అంటున్నారు.
మళ్ళీ కోమాలోకి జారుతున్నాను అని
కష్టం జారితే తిరిగి కోలుకోవడం అని
No comments:
Post a Comment