వేరు వేరు రంగుల
దుస్తుల ముసుగులు
శరీరాలు తొడుక్కుని .... అందులో
ఆత్మలను దాచుకుని
వేరు వేరుగా ఉద్దేశ్యాలు
మనోభావనల
శాసనాల మాటలను
వెదజల్లుతూ .... ఒకేలా
ప్రేక్షకులు పర్యాటకులలా కాక
గోడకు తగిలించబడిన
ఫొటో ఫ్రేం లో బంధించబడిన
ఛాయా చిత్రాల్లా
ముగింపు సాఫల్యం వరకూ
ఉందో లేదో తెలియని
శాశ్వతత్వం
దిశగా ప్రయాణిస్తూ .... మనం
No comments:
Post a Comment