ఆమె శూన్యం లా ఉండిపోయింది.
ఉలుకూ పలుకూ లేని అచేతనావస్థలోకి జారి
అతను లేకపోవడంతో
ఇన్నాళ్ళూ ఆ హృదయం కొట్టుకుంది
కేవలం అతని కోసమే ....
అతని సాహచర్యం లోనే కలలన్నీ కన్నది.
ఆమె అతన్ని ఘాడంగా ప్రేమించింది.
కానీ ఇప్పుడు
అతను లేని జీవితం జీవించాల్సిన స్థితి.
కానీ ఎలాగా .... ఎలాగో తెలియదు
ఏనాడూ ఆలోచించని స్థితి
కలనైనా ఊహించని దుర్భర స్థితి
ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు.
ఆమె విలపిస్తుంది. బండరాళ్ళు కరిగేలా
కలలన్నీ కరిగిపోయి అన్యాయం ఐపోయి
అతను లేని కల కనాలని ప్రయత్నించి
కల కనాల్సిన స్పందనలేమీ రాక
ఆమె హృదయం కొట్టుకోవడం మానింది.
ఇప్పుడు కలలు కనలేకపోతుంది.
రోదించాలని ప్రయత్నించింది.
అంతా అనిశ్చితి.
కన్నీళ్ళు రావడం లేదు
స్వయాన్నీ సర్వాన్నీ కోల్పోయినట్లు
No comments:
Post a Comment