నర్తించాలి నీవు!
ఉగ్రవాదం ....
పాశవికత రొమ్ముల మీద,
న్యాయం రాజ్యాంగం
రక్షక వ్యవస్థ నిర్వీర్యమయ్యాయని ....
నర్తించాలి నీవు!
ప్రేమించాలి నీవు!
సామాన్యుడి అమాయకత్వం ....
చిరు ఆశల్ని,
కన్నబిడ్డడ్ని చూసుకుని గర్వపడేందుకు
ఎర్ర బస్సుల్లో .... పడి పడి వచ్చి ....
క్షతగాత్రులుగా మిగిలిన మానవత్వాన్ని
ప్రేమించాలి నీవు!
గానం చేయాలి నీవు!
పల్లె వాతావరణాన్ని ....
జానపదాల్ని,
ఒక్కరికి కష్టం వస్తే ....
మేమున్నామంటూ కదిలొచ్చే,
సంస్కారాన్ని, భూతలస్వర్గాన్నీ ....
గానం చేయాలి నీవు!
No comments:
Post a Comment