Sunday, February 17, 2013

ఆలోచించు నేస్తం!

చంద్రశేఖర్ వేములపల్లి || ఆలోచించు నేస్తం! ||

కనిపిస్తూనే ఉంది
మనిషి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాడని
ఇకపై మూర్ఖత్వం దాచనక్కర్లేదని
ఎంత మూర్ఖుడైనా బహిరంగంగా తిరగొచ్చు
ఇక్కడ ఎవరూ ఎవర్నీ పట్టించుకోరు.
మెదడులన్నీ ట్రంకుపెట్టలయ్యాయి.
ఖజానాను నింపడానికే పనికొస్తున్నాయి.
మానవత్వం బురుజులు
రక్షణ గోడ కందకాల్లోకి జారిపోయింది.
మేదావులనబడేవారంతా విదూషకులై ....
డాలర్ల కోసం నగ్నంగా నర్తిస్తున్నారు.

చరిత్రను తిరగేసి చూస్తే
గుర్తుకొచ్చే వ్యక్తిత్వాలు ఎన్నో!
మరణించాక కూడా జీవించిన
మానవతావాదులు వారు.
మరణం కన్నా జీవనం పొడుగని
ఖచ్చితంగా చెప్పుతున్నట్లు ....
దాఖలాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడేమో
నిరక్ష్యపు నిర్లజ్జా వ్యవస్తలా ....
ఏదో జరిగే ఉంటుంది అన్నట్లు అంతా వేగం
అనుకరణ .... అవకాశం కోసం ఆత్మవంచనలు

అందుకే అనిపిస్తుంది
పారిపోవడం పట్టనట్లుండటం .... తప్పని
ఆలోచించే మనుషుల్ని అధికారంలోకి తెచ్చి
అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమయ్యిందని
ఆలోచించి, శాసించగలిగిన
యోగ్యత ఎక్కడుందో అన్వేషించాల్సిన క్షణాలివి అని
ఇప్పటినుంచైనా వ్యక్తుల్లో వ్యవస్తలో
ఆలోచనల్ని పునరుద్ధరించేందుకు కృషి చేద్దామని.

2013, ఫిబ్రవరి 17, ఆదివారం సాయంత్రం 4.10 గంటలు

No comments:

Post a Comment