Tuesday, March 7, 2017

విలక్షణత ప్రేమ



చెట్టు కొమ్మ, ప్రేమే
ప్రపంచం అని నమ్మిన
ప్రేమ జంటకు ....
కాలం, శూన్యం అంటే
పరిహాసం

ప్రేమే, పగలు
రాత్తిరి అని
ప్రేమే, సూర్యుడు
చంద్రుడు
నక్షత్రాలు అని 



ఆ జంటకు
ప్రేమే, సూర్యవర్ణము,
ఔన్నత్యము,
చిత్రమైన
వింత పరిమళమూను

సామాన్యత లోంచి
క్లిష్టత లోకి
పరిణామం చెందుతూ
ఊపిరాడనియ్యని విలక్షణత
ఆలోచనల సుడి, ప్రేమ


No comments:

Post a Comment