Saturday, August 23, 2014

జ్ఞాపకాల శరాలు తాకి



నేనొక బందీనయ్యాను.
నా మనసు కారాగారం లోనే ....
ఎప్పుడూ
నన్ను నేను కోల్పోయి
ఏ ఆలోచనల చిట్టడవిలొనో ఇరుక్కుపోయి
బయటపడలేక
తలరాతను రాసిన నేర్పరి ఏ జాలరి
వలలోనో చిక్కుకుపోయాననుకుంటూ ....
మార్గదర్శకం కోసం ఆశగా చూస్తున్నాను.
కాలం కనికరంతోనైనా
బయటపడగలను అనే నమ్మకంతో 



ఎక్కడో దూరంగా నిలబడి
నీవు, నన్ను చూసి నవ్వుతున్నట్లుంటుంది.
వెన్నెలలా మెరుస్తున్నట్లుంటావు.
నీ నీలిరంగు కళ్ళు ....
చేరువకు రమ్మని కవ్విస్తూ ఊరిస్తూ
నా రాత్తిరి ప్రశాంతతను
దూరం చేస్తుంటాయి..
కుక్కల కీచురాళ్ళ కేకల్లా ....
నాటి మన ఏ చిన్న జ్ఞాపకమయినా చాలు ....
ఈ గుండె మరింతగా బ్రద్దలవ్వడానికి

తొలుత సాధారణంలానే అనిపిస్తాయి.
ఆలోచనలు, అనుభుతులు
ఏ కదిలి వెళ్ళి పోయే పిల్ల గాలిలానో
నన్నొదిలి వెళ్ళిపోతున్నట్లు ....
కానీ,
ఆనాటి మన అనురాగ పరిమళాలు
వెళ్ళినంత వేగం గానే వచ్చి
మళ్ళీ చుట్టేసుకుంటున్నాయి.
జ్ఞాపకాలై ....
అవి నా గుండెను బలంగా తాకినప్పుడు
తట్టుకోలేక, నిబ్బరపడలేక  
కాలం సయోద్య కోసం
ఆశగా .... వేచి చూస్తున్నాను..
అయినా నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి.

2 comments:

  1. నన్ను నేను కోల్పోయి
    ఏ ఆలోచనల చిట్టడవిలొనో ఇరుక్కుపోయి
    బయటపడలేక
    తలరాతను రాసిన నేర్పరగు ఆ జాలరి
    వలలోనే చిక్కుకుపోయాననుకుంటూ ....

    " నీ నీలిరంగు కళ్ళు ....
    చేరువకు రమ్మని కవ్విస్తూ ఊరిస్తూ
    నా రాత్తిరి ప్రశాంతతను
    దూరం చేస్తుంటాయి..
    కుక్కల కీచురాళ్ళ కేకల్లా ....
    నాటి మన ఏ చిన్న జ్ఞాపకమయినా చాలు ....
    ఈ గుండె మరింతగా బ్రద్దలవ్వడానికి .... "

    చక్కటి భావన .

    తొలుత సాధారణంలానే అనిపిస్తాయి.
    ఆలోచనలు, అనుభూతులు
    కదిలి వెళ్ళి పోయే ఏ పిల్ల గాలిలానో
    నన్నొదిలి వెళ్ళిపోతున్నట్లు ....
    కానీ,
    " ఆనాటి మన అనురాగ పరిమళాలు
    వెళ్ళినంత వేగం గానే వచ్చి
    మళ్ళీ చుట్టేసుకుంటున్నాయి. "

    అందమైన , ఆనందమైన భావన .

    జ్ఞాపకాలై ....
    అవి నా గుండెను బలంగా తాకినప్పుడు
    తట్టుకోలేక, నిబ్బరపడలేక
    కాలం సయోద్య కోసం
    ఆశగా .... వేచి చూస్తున్నాను..
    అయినా నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి.

    ReplyDelete
    Replies
    1. గొప్ప విశ్లేషణ, మీకు మాత్రమే సాద్యమైన గొప్ప పరిశీలన, సూఅచనాత్మక సవరణ
      కవితను ఆద్యంతమూ సవరించుకున్నాను.
      హృదయపూర్వక కృతజ్ఞతలు.
      నమస్సులు శర్మ గారు!

      Delete