ఎప్పుడో ఒకప్పుడు అవసరాలు తీరని అభాగ్యులమే అందరమూ
పొందలేమని తెలిసీ ఆశ చావక ప్రాదేయపడుతూ .... సహాయం కోసం
సహాయం చెయ్యాల్సిన వారు వారికేమీ పట్టనట్లు
తమ తమ గమ్యాల వైపు కదులుతూ .... కనికరమూ, ప్రేమ
పంచాలనున్నా .... కాలం వృధాకావడం ఇష్టం లేకే
తోటి మనిషికి కనీసం మద్దతు పలకలేనట్లు, సహకారం చెయ్యందించలేనట్లు,
ఎవరి అవసరాలకో ఉపయోగపడటం తమ శక్తికి మించిన పనైనట్లు,
ప్రవర్తిస్తుండటం చూస్తూ ఉంటాము.
నిజంగా ప్రతి ఒక్కరూ సహాయం చెయ్యడమో పొందడమో
ఒక నిర్ణయం తీసుకోక తప్పనిస్థితే ఎదురైతేగానీ ....
తమను తామే అని చెప్పుకోలేని నోరులేని వారి కవచాలుగా
నరకతుల్య జీవనాన్ని గడుపుతున్న జీవితాల చీకటిని తరిమికొట్టే కాంతులుగా
ఈ రోజు చేసే సాయం ముందు తరాల వారసులకు చెందుతాయనుకునైనా
నిలబడమేమో. అనిపిస్తుంది.
నిజం! నీకు నా అవసరం ఉంది. నేను తప్పించుకు తిరుగుతున్నాను.
చెయ్యందించాల్సిన నేను దూరమై ....
ఎవరో నిన్ను .... ఒంటరితనం నుంచి బయటకు లాగి
నీ నిట్టూర్పే నన్ను పరిహాసిస్తున్నట్లనిపిస్తే .... ఎంత బాధో
తోటి మనిషినై నేను చెయ్యాల్సిన, చెయ్యగలిగిన సహాయం
ఎవరో అపరిచితుడు చెయ్యడం, ఎప్పటికీ గుర్తుండిపోయే ....
పరిహసించే అమానవత్వమే
ఒకరికొకరం సహాయం చేసుకుని జీవించాల్సిన స్థితే .... అందరిదీ
ఎవరికో సాయపడటం, నాకు నేను సాయపడటమే, సహకరించుకోవడమే
సహాయం పొందిన కళ్ళలో ఆనందం అద్భుతాలను చూడగలగడం
ఒక మంచి పని చేసిన సంతృప్తి, ఆనందంతో నిద్రించగలగడమూ జీవనవరమే
ఒక ఆరోగ్యకర వరం .... ఎవరికైనా సహాయం చెయ్యాలనే నిండైన ఆలోచన
ఎంత ఆనందమో, ఎంత ఉల్లాసమో ....
గుండె పాడుకునే పాట .... సహకరించుకోవాలనుకోవడమే అయితే
చక్కటి భావన .
ReplyDeleteఒకరికొకరం సహాయం చేసుకుని జీవించాల్సిన స్థితే .... అందరిదీ
సహాయం పొందిన కళ్ళలో ఆనందం అద్భుతాలను చూడగలగడం
ఒక మంచి పని చేసిన సంతృప్తి, ఆనందంతో నిద్రించగలగడమూ జీవనవరమే
ఒకరికొకరం సహాయం చేసుకుని జీవించాల్సిన స్థితే .... అందరిదీ
Deleteసహాయం పొందిన కళ్ళలో ఆనందం అద్భుతాలను చూడగలగడం
ఒక మంచి పని చేసిన సంతృప్తి, ఆనందంతో నిద్రించగలగడమూ .... జీవనవరమే
బాగుంది మీ స్పందన, స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యవాదాలు శర్మ గారు!