నా పగిలిన హృదయానికి తెలుసు
ఒంటరితనం వ్యధలో నైరాశ్యం ఏమిటో
ఆలశ్యము చేసే కొద్దీ
అన్నీ కోల్పోవల్సొస్తుందని,
నెమ్మదిగా కోరికలన్నీ .... సిగ్గుపడి
దూరంగా పారిపోతాయని,
ఆనందం, ఆహ్లాదం .... అనుభవం ఆవల
జీవనాన్ని ఆలోచించలేము.
అక్కడ ఏముందో తెలుసుకోవాలనిపించదు.
ఉల్లాసం ప్రభావం .... కొత్త ప్రశ్నలు మొలకెత్తవు.
మనసులో .... లోపల .... నుండి
కనిపించే ఆ ఆనందాన్ని ....
అంతం వరకూ అనుభవించేద్దాం అనిపిస్తుందే తప్ప.
ఒకే జ్ఞాపకం ఎన్నాళ్ళో మదిని సంతృప్తి పరచలేదు.
మసకబారిన మరొ జ్ఞాపకం .... మనం గమనించలేనంత స్విఫ్ట్ గా,
అనుభూతై మదిని ఆక్రమించేస్తుంది.
వార్డ్ రోబ్ లో హేంగర్ కు వేలాడదీసినట్లు,
ప్రతి జ్ఞాపకమూ ఓ నిశ్శబ్ద భావనలా కదులుతూనే ఉంటుంది.
ఒక్క గుండెకు తగిలిన ఒక్క గాయం మాత్రం,
ఎప్పుడూ,
సలుపుతూ బాధను పలుకుతూనే ఉంటుంది.
No comments:
Post a Comment