Saturday, April 20, 2013

జీవనానుభూతి


ఆకుల పచ్చదనం
తెలుపు ఎరుపు రంగు గులాబీలు
చెట్లను చూస్తున్నా!
నాకోసమే
అవి పూస్తున్నాయన్నట్లు .... నాలో ఆలోచనలు!

తెల్లని మేఘ గజగమనాలు
నిశ్చల నీలి ఆకాశం స్థిరావేశం చూస్తున్నా!
ప్రకాశవంతమైన పగళ్ళు .... పునర్జన్మలు
కలల బృందావనాల పరిచయాలు
ఉపశమనం రాత్రిళ్ళను చూస్తున్నా!

రంగురంగుల ఇంద్రధనుస్సు లు
అందం అలంకరించుకున్న 
ఆకాశం ముఖం .... లా
ఆకాశం భూమాత ను
పలుకరిస్తున్నట్లు చూస్తున్నా!

రహదారులపై కదులుతూ
ప్రాణం .... చైతన్యం
అప్పుడప్పుడూ సేదదీరుతూ
చిరునవ్వుల కరచాలనాలు
కుశలమా! అనే పలుకరింపులు

దివినుంచి దిగి వచ్చి
దేవతలు మనుషుల్లో కలిసిపోయినట్లు,
ప్రేమ, పవిత్ర భావనల్ని పూస్తున్నట్లు
ఆ పరిమళాలు "నిన్ను ప్రేమిస్తున్నాను" అని
స్పర్శిస్తున్నట్లు .... అద్భుత భావనలు

పసి పాపల ఏడుపులో వింటున్నాను.
ప్రపంచాన్ని అశ్వాదించాలనే ఆరాటం
చూస్తున్నా!
పాపలు, పిల్లలై, పెద్దలవ్వాలనే
ఆతృతను!

నాకు తెలిసింది కొంతే
కాలంతో పాటు రేపటి పౌరులు 
నా కన్నా ఎక్కువ నేర్చుకుంటారు
అనుభవాల పాటాలు
ప్రకృతి ఉపదేశాలు ఎప్పుడూ ప్రాణికి అందుబాటులోనే ....

ఒక .... మధ్యతరగతి మనిషిని
ఆత్మీయ సహజీవనం చేస్తున్నాను.
ఎంత అద్భుతం ఈ ప్రపంచం!
ఎంత గొప్ప అనుభవం
ఎంత పవిత్ర అవకాశం .... మనిషిగా జన్మించడం అనుకుంటున్నా!

No comments:

Post a Comment