Sunday, April 14, 2013

నేను సర్వసాధ్యుడిని |



జీవన ప్రలోభాలకు దూరంగా
చెడు నుంచి మంచిని వడపోసి
గొప్ప జీవన లక్ష్యాల్ని కలలు కని
యాంత్రికంగా జీవించాలనుకోని నాడు
నేనో అసామాన్యుడిని.

పలుకరించిన సలహాను గౌరవించి సమీక్షించి
నా నిర్ణయాలు నేను తీసుకుని
ఇతరుల విజయాన్ని హృదయపూర్వకంగా ప్రసంశించగలిగి
ఆశాభంగంనుంచి అనుభవాన్ని నేర్చుకున్ననాడు
నేనో కారణ జన్ముడిని.

అసాధ్యాల్ని .... చిరునవ్వుతో స్వాగతించి 
నవ్వగలిగి .... శ్రమించేందుకు ప్రయత్నించి
నా వల్ల కాదు అన్నోళ్ళను పట్టించుకోన్నాడు
పోరాట పటిమ పెంచుకుని సాధించగలను అనుకున్న నాడు
నేనో సాధకుడిని.

నా లక్ష్యాలను నేనుగా నిర్ణయించుకుని
నన్ను నేను నూతనంగా, ఉత్తమం గా,
నిస్వార్ధంగా .... ఆవిష్కరించుకుని, అంకిత భావంతొ
నా దారిలో ఇతరులకూ సహాయపడాలనుకున్న నాడు
నేనో సామాజిక తత్పరుడిని. 

ప్రతి ఉదయం తల్లిదండ్రుల్ని, ప్రకృతిని గౌరవించి (పూజించి)
గమ్యం వైపు నా పయనంలో వారి ఆశిస్సుల్ని నమ్మి
జీవితంలో ఒక మహోన్నత స్థానాన్ని చేరగలిగి
నా జీవితాన్నీ నన్నూ ఎందరికో ఆదర్శంగా మలిచిన్నాడు
నేను సర్వసాధ్యుడిని, చరిత్రపురుషుడ్ని!

2013, ఏప్రిల్ 14, ఆదివారం రాత్రి 9.45 గంటలు

No comments:

Post a Comment