అరతెరిచిన కిటికీ లోంచి
కలలు కొన్ని
చిరు శబ్దం చేస్తూ
వీధిలోకి జారుకున్నాయి
నక్షత్రాల సమూహాలతో
నిండిన ఆకాశం వైపు ....
బహుశ, ఆ నక్షత్రాల సరసన
విశ్రమించేందుకనేనేమో
అంతలోనే పిల్లగాలి తెరొకటి
సున్నితంగా
నా శరీరాన్ని తడిమి
ఆత్మను తట్టింది
నెమ్మదిలేని నా మదిని
అభ్యుదయేచ్ఛతో నింపి ....
కలలపై ఇంద్రధనస్సు రంగు
గమ్యాలను అద్ది
కనీసం అందువల్లనైనా నేను
స్థిమిత పడొచ్చని
అక్కడ ఆ పక్కనే
అదే అంతరిక్షం లో సేదదీరితే
సడిచెయ్యకుండా
నిశ్శబ్దంగా
ఆ నక్షత్రాలు, కలలతో కలిసి
విశ్రమిస్తే ....
No comments:
Post a Comment