Tuesday, June 20, 2017

జాగ్రత్త



మనమేమీ విశేషాలము కాము 
అలా అని వస్తువులమూ కాము

నావరకూ నేను ....
ఒక నటుడ్ని
ఒక రచయితను
ఒక కవిని
ఈ జీవన రంగస్థలం పై
మున్ముందు ఏమి చేస్తానో
తెలియని అశాంతి
అన్నీ పొందాలనే తపన తోడుగా  



ఏదో ఒకటి
ఎప్పుడైనా రాస్తూ
ఎక్కువగా నటిస్తూ ఉన్న
ఒక కర్మణిక్రియను .... నేను

పొరపాటున నీవు గాని
నిన్ను .... ఎప్పుడైనా
విశేషానివి అనుకునేవు
బంధించబడుతావు
అసంతృప్తి ఆశయ జంజాటంలో

No comments:

Post a Comment