వయసు మీద పడ్డాకైనా తప్పించుకోలేము .... గతపు పీడలనుంచి అని
పగిలి, విరిగి, నాశనమైన అస్తిత్వం పునాధులపై చదికిలపడాల్సొస్తుందని
కట్టెలపై భగ్గుమని మండాల్సిన
ఒకనాటి ఎండి రాలిన ఆశల కన్నీళ్ళ కలల శరీరావశేషాలపై
ఎంతో పటిష్టంగా నిర్మించుకున్న .... ఊహల సామ్రాజ్యమే
బానిస జీవనంగా అవిష్కారం ఔతుంది పరిణామక్రమంలో అని
ఎన్ని అవరోధాలు ఎన్ని ఎదురుదెబ్బలు ఎన్ని వినాశన చ్చాయలు
గతం లో, ఈ ఎద లో, శూన్యం అనేది లేని ఈ నగరపు ఒంటరితనంలో
ఈ నిరాశ నిస్పృహల్లోంచి నీతో కలిసి .... ఒకప్పటి గతం లో
పంచుకున్న ఆ ఆనందానుభూతుల జ్ఞాపకాల్లోకి జరగక తప్పక
మనము కలిసి గడిపిన నిన్నటి వేళల ఆ ఉన్నత ఆశయాల
ముద్దు ముచ్చట్ల పరిపూర్ణానందం .... విఫలపయత్నమే అని
ఎవరికోసమూ ఆగని కాలగమనంలో పునర్నిర్మాణావశ్యకత పెరిగి
జీవితానుభవసార అవసరాల కిటికీలోంచి చూడటంతో పాటు
నూతన సామాజిక ప్రాపంచిక మార్పుల ఆలోచనల గవాక్షంలోంచి
ప్రతిదీ నెమ్మదిగా సులోచనాలతో చూడటం ఆవశ్యకత అయ్యి
జీవన యానంలో కాలంతో పాటు తప్పనిసరైన
మార్పు దిశగా పునర్పురోగమనానికి ఉపక్రమించక తప్పదు అని
No comments:
Post a Comment