సూర్యాస్తమమౌతూనే అలసిన
నీ ఆలోచనలన్నీ ఆశ్చర్యంగా నా చుట్టూ
ఎందుకు ఎలా ఏమి చేస్తున్నానో
నేనెక్కడున్నానో అనే .... అవునా?
పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ
నా కళ్ళను అలుముకున్న బాధను
నీవు పలుకని నీ మౌన రాగాలే
అందుకు కారణం అని నీకు తెలిసి
ఎన్ని సంగతులు ఎన్ని ఆలోచనలు
పెదవుల్ని దాటని ఎన్ని పదాలో
దూరంగా వెళ్ళిపోయిన నీ అసహాయత
ఆ పలుకులు రాని నీ నిర్లిప్తత వెనుక
నీకు ఎప్పుడూ ఆశ్చర్యమే సుమా
నన్ను గురించిన ఆలోచనల్లో
అలా ఈదులాడుతూ నేనెక్కడున్నానో అని
నేను ఏమి చేస్తునానో అనే ఆ ఉత్సుకతలో
No comments:
Post a Comment