చీకటి ఆలోచనల గతాలు .... మాలాంటి వారి అస్తిత్వాలు
ఎప్పుడూ చీకటి గుహల్లోనే నివశించుతూ
చిక్కని సాధ్యం కాని ఆకాంక్షల అవాస్తవికత లో
ఆశగా, ఎవరైనా వస్తారని .... ఒకరోజొస్తుందని
జీవితం వెలుగుమయం అవుతుందని అనుకుంటూ
ఆ చీకటికి మాత్రమే అలవాటు పడిన
ప్రవర్తన .... చూపుల్లో అగ్ని, ఎదురైన ఆవేశాన్ని
మమ్మల్ని అర్ధం చేసుకోవడం సులభం అనుకోను ....
మా అంతరంగాల్లో దాగి ఉన్న సంఘర్షణల్ని
ముఖాలపై పూచిన చిరునవ్వు చాటు బాధల్ని
నల్లని చీకటి దుప్పటి కప్పుకున్న అగంతకుల్లా
ముసుగేసుకున్న .... చందమామ వాగ్దానాలు మావి
మా తారకలతో .... ఎన్నో కాదు ప్రతిదీ చేస్తామని
మేము బ్రతుకుతున్నదే వారి కోసం అని
కేవలం వారి కోసమే శ్వాసిస్తున్నామని బాసలాడుతూ
చీకటిలోనే మా నివాశం తప్పని శాగ్రస్తులము మేము
తెలుసు .... తప్పదు అని, నొప్పిని సహించక
అది ఎంత భరించలేనిదే అయినా,
నిరుపయోగ జీవులమని అనిపించినా, ఏడ్చినా
ఎంత పశ్చాత్తాపపడినా తగ్గని బాధ మా అస్తిత్వాలది అని
మాలాంటి చీకటి బ్రతుకులకు సహచరి దొరకడం కష్టం
ఒంటరితనమే మాలాంటి వారి తోడు
మేము ప్రేమించిన వారు ఎందరు ఉన్నా .... అందరూ
మమ్ము నమ్ముకున్న, మేము సహకరించిన వారే అయినా
అందరికీ భయమే మేమన్నా చీకటన్నా .... తోడుండేందుకు
కొన్ని నిజాలంతే .... అనాకార అందహీనతలే
ఎప్పుడైనా ఏ అనుసరణీయమైన .... మంచి పని చేసినా
అనుసరించేందుకు అయిష్టపడే వారే అందరూ
వారి శాపశరాలు చేసిన గాయాల .... తప్పని బాధలే
చీకటి మనిషి అనే .... అసామాజిక న్యాయమే
మాలా ఎందరో .... ఆ చీకటి మానవులు
ఉత్సాహాన్ని పంచి ప్రతిగా అగౌరవాన్ని పొంది
మేమంతా చీకటి సామ్రాజ్య అధిపతులమే
బాధ్యత్వము మీద సతతమూ నిలబడి
చీకటిని ధరించిన .... నిర్మూల్య అపరిచితులమై
No comments:
Post a Comment