నా ఆత్మాభిమానం లో
లోతుగా గుచ్చుకుని ఉన్న ముల్లు
ఎవరో బయటికి తీసేసినట్లు,
నాలో నేను శూన్యంలా
ఇన్నాళ్ళూ కోల్పోయింది .... దొరికినట్లు,
పక్కన, చేతిలో చెయ్యేసి
ఓ అమృత మూర్తి నడుస్తున్నట్లు
నా ఆత్మను శుద్ది చేసినట్లు ఏవో భావనలు
క్రమం తప్పక
పత్రహరితం, వెలుగులు
చైతన్యం .... అందరికీ అందిస్తున్న
ఆ సూర్యదేవునికి
ఆ పరిపూర్ణ ప్రేమ మూర్తికి నమస్సులు
ఆలోచించేకొద్దీ .... ఇప్పుడు
నా కల్పనలు భయాల మధ్య
ఖండాంతరాల దూరం కనిపిస్తుంది.
ప్రేమ అనే అనుభూతిని స్పష్టంగా చూస్తున్నా
నా ఇన్ హిబిషన్స్ అన్నీ
వదిలేసేందుకు సిద్ధం గా ఉన్న క్షణాల్లో
ఇప్పుడు
నా భావోద్వేగాలు
నేను పీల్చుతున్న శ్వాస తో నిండిపోయాయి.
వేదాలు, చరిత్ర నిర్వచించిన
ధర్మ యుద్దాలు ఆత్మ త్యాగాలు
పవిత్ర ధరిత్రి నాదని చెప్పుకున్నా .... ఇన్నాళ్ళూ
ఔనూ ఇప్పుడు ప్రేమ స్వస్థత
ఉపశమనము నేనే ఎందుకు కాకూడదు?
2013, మే 03, శుక్రవారం ఉదయం 7.48 నిమిషాలు
No comments:
Post a Comment