నాతోనే, నాలోనే, పదిలంగా వుంది నా హ్రుదయం లో...
నీ హ్రుదయం ... నా ప్రాణం, అది లేని నేను లేను
ఎక్కడ వున్నా, ఏమైనా నీవూ నాతోనే, నా ప్రాణమా ...
ప్రతి క్రియా నీ ప్రేరణే, ప్రియతమా ...
జాతకాలు భూటకాలే, నా నమ్మకం, భవిష్యం మాత్రం ... నీవే ప్రియా!
ఈ ప్రపంచంతో నాకు పని లేదు ... నా అందమైన ప్రపంచానివి
... నీవు ...
వెన్నెల వికశించే చద్రబింబానివి!
ప్రతి ఉదయపు అరుణ చైతన్యానివి ... వెలుగు కాంతి పుంజానివి!!!
ఎవరికీ అంతుబట్టని రహశ్యం వుంది చెప్పనా!
... ప్రియా ...
వేరులో వేరునై, మొగ్గ లో చిరుమొగ్గనై, కొమ్మలో కొమ్మనై ఆకాశమంత ఎదిగిన హ్రుదయ సామ్రాజ్యానికి రాజును ... నెలరాజును నేను ...
ఆత్మకూ, ఆలొచనలకూ, వుహకూ అందనంత ఎత్తులో మనసు దాయలేని నిజం ... అది ...
నక్షత్రాలతో ఆడుకోగలుగుతున్న అద్భ్తతమైన ఆకాశ క్రీడ ... స్వర్గం వాకిట్లో నేను ... ఐనా ...
నీ హ్రుదయం నాతోనే వుంది ... నా హ్రుదయం లో భద్రంగా ...
" స్వర్గం వాకిట్లో నేను ... ఐనా ...
ReplyDeleteనీ హ్రుదయం నాతోనే వుంది ... నా హ్రుదయం లో భద్రంగా ..."
చంద్రా గారు..మీ కలం నించి జాలువారిన అద్భుతమైన కవితావాహినిని చూస్తున్నా..