Friday, January 14, 2011

నగ్న సత్యం ...

అందం, ఆకర్షణ కలకలిసి ...
కవ్వించే అయస్కాంతం ... ప్రేమ!

అప్పుడే కలిపి, వెంటనే విడదీసే లక్షణమే ... ప్రేమ?

ఒకవైపే లాగుతూ ... వొకరినే చూడాలనుకునే ...
మనసు పెనుగులాటకు ... కారణం ప్రేమ?

అనుమానం పిశాచి నిలదీస్తే సమాదానం లేని ...
నిజంగా అది ప్రేమేనా, లేక అనుకోవడంవల్లే అది ప్రేమా అని?

కలిసి ఉన్నారు, కలలు కన్నారు ... జీవిస్తున్నారు కనుక ప్రేమిస్తున్నట్లా ...
లేక ప్రేమ అనే అందమైన బావనను ప్రేమిస్తున్నట్లా?

ప్రేమాన్వేషణలో ... ప్రేమను అర్దం చేసుకునే దిశలో ...
పడుతూ లేస్తూ పరుగెట్టే మనిషి జీవితం లో ...

ఒకే ఒక్క నగ్న సత్యం ...

భగ భగమనే నిప్పుకణికల్లో కాలిన హ్రుదయమే వెలుగులు వెదజల్లుతుందనేది ......
ఆ వెలుగుల కాంతిలో ప్రతిదీ ప్రేమ లా కనిపిస్తుందనేది ......

1 comment:

  1. ఒకవైపే లాగుతూ ... వొకరినే చూడాలనుకునే ...
    మనసు పెనుగులాటకు ... కారణం ప్రేమ?
    ప్రేమను గురించిన నగ్న సత్యాన్ని ఎంత చక్కగా చెప్పరు చంద్రా గారు!

    ReplyDelete