నిశిరాత్రి
భరించలేని నిశ్శబ్దం .... ఒంటరితనం
నివురుగప్పిన నిప్పుల మధ్య
నుశిగా మారిన
మధుర శ్మృతులు ... వదిలివెళ్ళలేను.
నీరసం
సర్వం .... నిర్మానుష్యం
సడలించుకోలేని ... మనసు సంకెళ్ళు!
ఆకాశం మబ్బుల మయం గా ....
మబ్బులు రోధిస్తున్నట్లు .... నన్నోదారుస్తున్నట్లు
ఉపశమనానుభూతి అది!
వర్షించే నీ కన్నులు ఆ మేఘాలైనట్లు
నీ ప్రెమే అలా .... వర్షించుతున్నట్లు
నా పక్కనే నీవు వున్నట్లు .... భ్రమ
అది .... కాలి బూడిదైన వాస్తవం!
ఆ మేఘాల వెనుక .... మిణుకు మిణుకు మని
నన్ను జాలిగా చూస్తున్న ... ఆ నక్షత్రానివి నీవు కాదూ!
మిగిలిన ఈ తోడులేని జీవితం ...
అ సంకల్పం .... ఊహించని నిజం!
ఔనూ! .... నా కళ్ళెందుకు ప్రతి వర్షిస్తున్నాయి?
నా మనస్సెందుకు ఊగిసలాడుతుంది?
నా అభిలాష మాత్రం ....
నీ పక్కనే నా స్థానం అని .... నీ వద్దకు నే చేరాలని!
భరించలేని నిశ్శబ్దం .... ఒంటరితనం
నివురుగప్పిన నిప్పుల మధ్య
నుశిగా మారిన
మధుర శ్మృతులు ... వదిలివెళ్ళలేను.
నీరసం
సర్వం .... నిర్మానుష్యం
సడలించుకోలేని ... మనసు సంకెళ్ళు!
ఆకాశం మబ్బుల మయం గా ....
మబ్బులు రోధిస్తున్నట్లు .... నన్నోదారుస్తున్నట్లు
ఉపశమనానుభూతి అది!
వర్షించే నీ కన్నులు ఆ మేఘాలైనట్లు
నీ ప్రెమే అలా .... వర్షించుతున్నట్లు
నా పక్కనే నీవు వున్నట్లు .... భ్రమ
అది .... కాలి బూడిదైన వాస్తవం!
ఆ మేఘాల వెనుక .... మిణుకు మిణుకు మని
నన్ను జాలిగా చూస్తున్న ... ఆ నక్షత్రానివి నీవు కాదూ!
మిగిలిన ఈ తోడులేని జీవితం ...
అ సంకల్పం .... ఊహించని నిజం!
ఔనూ! .... నా కళ్ళెందుకు ప్రతి వర్షిస్తున్నాయి?
నా మనస్సెందుకు ఊగిసలాడుతుంది?
నా అభిలాష మాత్రం ....
నీ పక్కనే నా స్థానం అని .... నీ వద్దకు నే చేరాలని!
"ఆ మేఘాల వెనుక మిణుకు మిణుకు మని ... నన్ను జాలిగా చూస్తున్న ... ఆ నక్షత్రానివి నీవు కాదూ!"
ReplyDelete"నివురుగప్పిన నిప్పుల మధ్య నుశిగా మారిన మధుర శ్మృతులు"
ఈ మాటలు తీవ్రమైన వేదనతో రాసినట్లుగా వున్నయండి చంద్ర గారు..అభినందనలు!