రాలుతుంటాయి
నెమ్మది బుజ్జగింపులా,
అప్పుడప్పుడూ
డొంకతిరుగుడుగా,
ఎప్పుడైనా నిశ్శబ్దంగా ....
ఊహించని అతిథిల్లా,
తారాడుతున్నట్లు,
అప్పుడప్పుడూ ఖండనలా,
చర్మాన్ని చీల్చి
ఎముకల్ని తాకుతున్నట్లు,
గూడార్ధాల మయమై,
అప్పుడప్పుడూ
గోరు వెచ్చని
ఉప్పని
కన్నీరు తడై,
ఎప్పుడైనా
మర్మగర్భంగా,
భయం
గాయం వెనుక
దాక్కున్నట్లు,
కొన్నిసార్లు గుండెల్ని తాకే
ప్రేమ జల్లై
గుసగుసల తడి
తడుపులా
ఆత్మలలో ఇంకి,
అప్పుడప్పుడూ
అర్ధవంతంగా
నమ్మబుద్దౌతూ,
పరిపూర్ణతతో నిండి ....
మళ్ళీ వినాలనిపించేలా
No comments:
Post a Comment